ఉప్పులేని వంటను ఊహించలేము. శరీర అవసరాలకు అవసరమైనంత ఉప్పు తీసుకోవటం అవసరమే . అయితే నాలుకను సంతృప్తి పరచేందుకు అతిగా ఉప్పు వాడితే మాత్రం ముప్పే అంటున్నారు వైద్యులు. ఉప్పు తక్కువగా తినేవారిలో క్యాలరీలూ త్వరగా తగ్గి చక్కని ఆరోగ్యమూ, తగిన బరువూ సాధ్యమంటున్నారు. మన దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనశైలి మారుతోంది. ప్యాకేజ్డ్‌, ప్రాసెస్‌ చేసిన, రెడిమేడ్‌గా దొరికే ఆహారాలను తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. సగటు భారతీయుడు రోజుకు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు. ఇది జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కన్నా చాలా ఎక్కువ. ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకూడదని సంస్థ సూచిస్తోంది.  ఉప్పు వాడకం మితిమీరితే వచ్చే కొన్ని ఇబ్బందులు, వాటికి గల కారణాలను తెలుసుకుందాం.

  • ఉప్పు ఎక్కువైతే హైబీపీకి దారి తీసి అంతిమంగా గుండె జబ్బులు, పక్షవాతానికి దారి తీయ వచ్చు.
  • ఎదిగే వయసు పిల్లలు అతిగా ఉప్పు తింటే ఊబకాయం బారిన పడే ప్రమాదం చాలా ఎక్కువ.
  • ఉప్పు మన శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుతుంది. శరీరంలోని ఆమ్ల క్షార నిష్పత్తిని క్రమబద్దీకరించే చర్యలో సోడియం ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. సోడియం శాతం పడిపోతే కండరాలు నీరసించి మనిషి తేలికగా అలసటకూ చికాకుకూ లోనవుతాడు.
  • ఉప్పు ఎక్కువైతేకొన్నిసార్లు మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు.
  • ఉప్పు వాడకం మితిమీరితే జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఉప్పుతో  సౌందర్య పోషణ

  • చెంచాడు సాల్ట్ ను అంటే మొత్తం ఆలివ్ నూనెలో కలిపి రంగరించి మెడ, ముఖచర్మం మీద రాసుకుని, ఆరిన తర్వాత కడిగితే ఆయా భాగాలలో చేరిన మురికి వదిలిపోతుంది.
  • స్నానపు నీటిలో గుప్పెడు ఉప్పు వేసి ఆ నీటితో స్నానం చేస్తే దురదలు వదిలిపోతాయి .
  • జిడ్డు చర్మం ఉన్నవారు గోరు వెచ్చని నీటిలో చెంచాడు ఉప్పు కలిపి అప్పుడప్పుడూ ఆ నీటితో ముఖం తుడుచుకుంటే జిడ్డు పట్టటం తగ్గుతుంది.
  •    తేనె, ఉప్పు కలిపి మొటిమలకు రాస్తే త్వరగా తగ్గుతాయి

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE