ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన ఫలాలలో బొప్పాయిది ప్రత్యేక స్థానం.  పచ్చిబొప్పాయి కాయలను కూరగా, దోరగా పండిన వాటిని నేరుగా తినొచ్చు. బోలెడన్ని పోషకాలను అందించటంతో బాటు సులభంగా జీర్ణమయ్యే  బొప్పాయిని పిల్ల నుంచి పెద్దల వరకూ అందరూ తినొచ్చు. ఏడాది పొడవునా లభించటమే గాక చౌక కూడా.  బొప్పాయిని మందులలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.బొప్పాయిని ఎన్నొ వ్యాధులకు, రోగాలకు, చర్మానికి మందుగా వాడుతున్నారు. నాలుగు శతాబ్దాల క్రితం  విదేశీయులతో బాటు వచ్చిన బొప్పాయి అన్ని రకాల వాతావరణ పరిస్థితులనూ తట్టుకొని ఎదుగుతుంది. పలు ఔషధాల తయారీలోనూ బొప్పాయి వేళ్ళు, గింజలు, గుజ్జు తదితర భాగాలు వాడుతారు. గర్భ నిరోధకంగానే గాక గర్భస్రావ కారకంగా పనిచేసే బొప్పాయిని గర్భవతులు, తల్లికాదలిచిన వారు తినకపోవటమే మంచిదని పెద్దలు చెబుతారు. బొప్పాయిలోని పీచు జీర్ణ శక్తిని పెంచి మలబద్దకం, అజీర్తి వంటి జీర్ణ కోశ సమస్యలను నివారిస్తుంది. బొప్పాయి పండుకు సంబంధించిన మరికొన్ని విశేషాల గురించి తెలుసుకుందాం.

 • ప్రతి వంద గ్రాముల బొప్పాయిలో సుమారు అరవై నుంచి వంద మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందుకే బొప్పాయి చక్కని రోగనిరోధక శక్తికి, చర్మం నిగారింపుకు దోహదపడుతుంది.
 • క్షయ నివారణకు బొప్పాయి ఉపయోగపడుతుంది.
 • పరగడుపునే బొప్పాయి తింటే రక్తపోటు అదుపులోకి రావటమే గాక కడుపులో చేరిన నులి పురుగులు తొలగిపోతాయి.
 • బొప్పాయి వేరు మూత్రపిండాల్లోని రాళ్ళు కరిగేందుకు ఉపయోగపడుతుంది.
 • మధుమేహ రోగుల్లో రక్తనాళాలు కుచించుకు పోవటం వల్ల గుండె పనితీరు దెబ్బతింటుంది. అందుకే మధుమేహులు రోజూ ఒకటి, రెండు ముక్కలు బొప్పాయి తీసుకుంటే రక్తనాళాల పనితీరు మెరుగుపడుతుంది.
 • రక్తంలో మోతాదుకు మించి కొలెస్ట్రాల్‌ ఉన్నవారు రోజూ బొప్పాయిని తింటే ఎలాంటి మందులు వాడకుండానే నెలరోజుల్లో కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.
 • పలు ఉదర సంబంధిత అనారోగ్యాలకు బొప్పాయి దివ్యమైన ఔషధ. బొప్పాయి గింజలను నూరి చెంచాడు తీసుకుని దాన్ని చెంచాడు నిమ్మరసంతో మూడు పూటలా తీసుకుంటే దెబ్బతిన్న కాలేయం (లివర్) ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 • కీళ్ళ వాతం, ఎముకలు బోలుగా మారటం, ఆస్తమా బాధితులు బొప్పాయి తింటే ఆయా సమస్యల కారణంగా వచ్చిన నొప్పులు, వాపులు ఉపశమిస్తాయి.
 • బొప్పాయి ఆకులో ఉండే కార్విన్ అనే రసాయనం నొప్పుల నివారిణిగా పనిచేస్తుంది. అందుకే కీళ్ళ నొప్పులతో బాధపడేవారు బొప్పాయి ఆకులను వేడిచేసి కట్టుకడితే కీళ్ళ నొప్పులు ఉపశమిస్తాయి.
 • టాన్సిల్స్, నోటి పూతతో సతమతమయ్యేవారు పచ్చి బొప్పాయి ఆకును నమిలి ఆ రసాన్ని పుక్కిలిస్తే సమస్య తగ్గినట్లే.
 • బొప్పాయి గుజ్జును ఫేస్పాక్ గా వేసుకుంటే  ముఖం మీది మచ్చలు, మొటిమలు, చర్మ వ్యాధులూ దూరమవుతాయి. చర్మం మీది మృతకణాలూ తొలగిపోయి చర్మం  ప్రకాశిస్తుంది.
 • బొప్పాయి పండులో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ వుంటాయి గనుక ఇది చక్కని యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి హానికారక ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని నిరోధిస్తుంది.
 • ఋతుక్రమ సమస్యలకు బొప్పాయి చక్కని మందు.అంతేకాక ఆడవారిలో రుతుక్రమ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పిని బొప్పాయి తొలగిస్తుంది.
 • అధిక బరువు తగ్గాలంటే బొప్పాయిని రోజూ వాడితే సరి. బొప్పాయిలో ఉన్న సహజమైన పోషకాలు తక్కువ కాలరీలు ఉత్పత్తి చేసి లావుగా ఉన్నవారిని సన్నగా చేస్తాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE