ఆకట్టుకునే రూపం, విచ్చి చూస్తే పగడాల్లా కనువిందు చేసే గింజలు,  తీపి, పులుపు, వగరు కలయికగా ఉండే ఆకట్టుకునే రుచి, గింజ గింజలో నిండిన పోషకాలు.. ఇలా దానిమ్మ గురించి యెంత చెప్పినా తక్కువే. దీని గింజలేగాక ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, బెరడు, గింజల మధ్య ఉండే పల్చని పొరల్లోనూ బోలెడన్ని   ఔషధ గుణాలున్నాయి. భారతీయ గ్రంథాలలో ఔషధీయ హిమాలయ ఫలంగా ప్రస్తావించిన దానిమ్మ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల నేలల్లోనూ చక్కని కాపునిస్తుంది. సంస్కృతంలో దంతబీజ, శుకవల్లభ, దాడిమ అనే పేరున్న దానిమ్మను హిందీవారు అనార్ అంటారు. తీపితో బాటు పులుపు దానిమ్మ కూడా మన దేశంలో విస్తృత వినియోగంలో ఉంది. దానిమ్మ విశేషాలు, ఆరోగ్యపరిరక్షణలో దాని పాత్ర యెంత గొప్పవో తెలుసుకుందాం.

హృదయారోగ్య పరిరక్షణ

 • దానిమ్మ తింటే చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీ ఎల్) తగ్గి మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డీ ఎల్) పెరిగి గుండె జబ్బులు రావు.
 • దానిమ్మ రసానికి రక్తాన్ని పల్చబరిచే గుణం ఉంది. రక్తనాళాలు కుచించుకు పోయిన వారు దానిమ్మ తింటే గుండెకు రక్తప్రసారం జరిగి తగినంత ప్రాణవాయువు అందుతుంది.
 • దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు ధమనుల గోడలపై కొవ్వు పెరుకోకుండా చూస్తాయి.

మహిళల ఆరోగ్యం

 • స్త్రీలలో మెనోపాజ్ సమస్యల నివారణ, జీవక్రియల మెరుగుదలకు దానిమ్మ ఎంతగానో ఉపయోగపడుతుంది.
 • దానిమ్మ గింజల నూనెలో ఉండే పైథో ఈస్ట్రన్, వ్యునిసిన్ ఆమ్లం చర్మం, స్తనాలు,గర్భాశయ ఆరోగ్యానికి దోహదపడతాయి.
 • మహిళల్లో కనిపించే రక్త హీన సైతం దూరమవుతుంది.

 ఇతర ఉపయోగాలు

 • దానిమ్మ గింజల్లో ఉండే పీచు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
 • రోజూ దానిమ్మ గింజలు తింటే పళ్ళ మీద చేరిన గార తొలగిపోతుంది.
 • నీళ్ళ విరేచనాలు కట్టుకోవాలంటే ఓ గ్లాసు దానిమ్మ రసం తాగితే సరి.
 • మెదడు పనితీరును మెరుగు పరచి అల్జీమర్స్, మతిమరపు రాకుండా దానిమ్మ పనిచేస్తుంది.
 • దానిమ్మకు పురీష నాళ (ప్రోస్ట్రేట్ ) క్యాన్సర్ రాకుండా చేసే గుణం ఉంది.
 • దానిమ్మలోని పలు పాలీఫినాల్స్ వాళ్ళ ఇది చక్కని యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. స్తన, చర్మ వంటి పలు క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడే గ్రీన్ టీ, రెడ్ వైన్ కంటే మేలైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
 • రోజూ గ్లాస్ దానిమ్మ రసం తాగితే అవసరమైనంత ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ, సి అందినట్లే.
 • దానిమ్మ రాసంలోని సహజమైన చక్కెరల వాళ్ళ ఎక్కువ క్యాలరీలుంటాయి. అందుకే రసం తాగిన క్షణాల్లోనే ఎంతటి అలసటైనా తొలగిపోతుంది. చిన్నారులు, క్రీడాకారులు దానిమ్మము తప్పక తీసుకోవాలి.
 • బరువు తగ్గాలనుకునే మధుమేహులు రోజూ దానిమ్మ తింటే బరువు అదుపులోకి వస్తుంది.
 • ముక్కు నుంచి రక్తం కారుతుంటే దానిమ్మపూల రసాన్ని ముక్కుల్లో వేస్తే వెంటనే రక్త స్రావం ఆగుతుంది.
 • 15 మిల్లీలీటర్ల దానిమ్మ రసంలో అంతే మొత్తం తేనె కలిపి రోజుకు 3 సార్లు తీసుకుంటే ఆకలిలేమి, కడుపులో మంట తగ్గుతాయి.
 • మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు దానిమ్మ రసం తాగితే రాళ్ళు కరిగే అవకాశం ఉంది.

గుర్తుంచుకోండి

 • శరీర తత్వం, ఇతర అనారోగ్యాల వల్ల కొందరికి దానిమ్మ గిట్టక ఎలర్జీ లక్షణాలు కనిపించవచ్చు.
 • దానిమ్మలో చక్కెర స్థాయులు అధికంగా ఉంటాయి గనుక మధుమేహులు దీన్ని పరగడుపునే తినకూడదు.
 • కొన్ని రకాల మందులు వాడేవారు దానిమ్మ వాడకపోవటమే మంచిది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE