ఏడాదిలో మిగిలిన రోజులతో పోల్చితే ఎండాకాలంలో చెమటపట్టడం కాస్త ఎక్కువే. నమోదైన ఉష్ణోగ్రత, గాలిలో తేమను బట్టి చెమట తీవ్రత ఆధారపడి వుంటుంది. ఈ పరిస్థితులకు తగ్గట్టుగా మన చర్మం మీది స్వేద గ్రంధులు పనిచేస్తూ శరీరాన్ని వీలున్నంత మేరకు చల్లగా ఉండేలా చేస్తాయి. స్వేదగ్రందులు శరీరమంతా ఉన్నప్పటికీ  తల, చంకలు, ముఖ చర్మంలో ఎక్కువగా ఉన్నందునే ఆయా భాగాలలో చెమట ఎక్కువగా పడుతుంటుంది.  ఇతరులతో పోల్చినప్పుడు కాయకష్టం చేసేవారికి చెమట ఎక్కువగా పడుతుంది. ఈ చెమటతో బాటు శరీరంలోని  ప్రొటీన్లు, కొవ్వు, ఆమ్ల లవణాలు, అమ్మోనియా వంటివి కూడా బయటికి పోతుంటాయి. కొందరిలో  చెమట ఎండిపోయిన తర్వాత చర్మం నుంచి యూరియా, లవణాల వంటివి ఎక్కువగా విడుదలై రోగ కారకాలను ఆకర్షించి శరీర దుర్వాసనకు కారణమవుతాయి.

అలాగని అందరిలోనూ ఈ దుర్వాసన సమస్య ఉండదు. ఆహారంలో తగిన మార్పులు చేసుకోవటం ద్వారా ఈ సమస్యను సమర్ధవంతంగా అధిగమించవచ్చు. మరీ ముఖ్యంగా  కాఫీ, శీతల పానీయాలు, బ్లాక్ టీ, చాక్లెట్, వెల్లుల్లి, నీరుల్లి, చేపలు, రొయ్యల వంటి సీఫుడ్ మూలంగా చెమట అధికంగా పట్టే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా రా ఉండటంతో బాటు పలు ఆహారాల సాయంతో ఈ సమస్యనుంచి బయటపడటం ఎలాగో తెలుసుకుందాం.  

 • వేసవిలో విరివిగా లభించే పుచ్చకాయ తినటం వల్ల తగినంత నీరు, పీచు, పోషకాలు అందుతాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగు పరచి చెమటను అదుపులో పెడతాయి. పుచ్చలోని విటమిన్‌ బి జీవక్రియల పనితీరును ఎంతగానో మెరుగు పరుస్తుంది.
 • దాహంతో నిమిత్తం లేకుండా తరచూ తగినన్ని మంచినీళ్ళు తాగటం వల్ల శరీరంలోని నీటి నిల్వలు సమస్థితిలో ఉంటాయి. దీనివల్ల శరీరం చల్లగా ఉండి చెమట పట్టటం కూడా తగ్గుతుంది.  
 • క్యాల్షియం శరీర ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉండేలా చేసి, చెమటను తగ్గిస్తుంది. క్యాల్షియం పెరుగులో పుష్కలంగా లభిస్తుంది. పెరుగు ఇష్టపడని వారు ఇతర పాల పదార్ధాలు, బాదం గింజలు, చిక్కుళ్ళు వంటివి తీసుకోవచ్చు.
 • జీవక్రియల పనితీరు బాగుండాలంటే ఆహారంలో తగినంత బి కాంప్లెక్స్ విటమిన్ అందేలా చూసుకోవాలి. రోజువారీ ఆహారంలో బ్రెడ్ , గుడ్లు, చేపలు, గింజ ధాన్యం, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
 • ఆహారం తేలికగా జీర్ణమయ్యే వారిలో చెమట బెడద ఉండదు. అందుకే వంటకాలలో కాస్త ఆలివ్ నూనె చేర్చితే చక్కని ఆరోగ్యంతో బాటు ఆహారం సులువుగా జీర్ణమై చెమట సమస్య దూరమవుతుంది.
 • ఆహారంలో తగినంత పీచు ఉంటే జీర్ణప్రక్రియ సులువుగా జరిగి చెమట పట్టటం తగ్గుతుంది.  అందుకే రోజూ పీచు అధికంగా ఉండే గోధుమలు, ఓట్స్, పండ్లు తీసుకోవాలి.
 • చెమట నివారణకు పుదీనా ఎంతగానో దోహదపడుతుంది. ఈ వేసవిలో తరచూ పుదీనా రసం కలిపినా పానీయాలు తీసుకుంటే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగై,  చెమట పట్టటం తగ్గుతుంది.
 • వేసవిలో రోజూ టమోటో రసం తాగటం వల్ల పలు విటమిన్లు, ఖనిజలవణాలు( పొటాషియం, మాంగనీస్‌) అంది చెమట, దుర్వాసన వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి.
 • రోజూ కరివేపాకు తినేవారిలో చెమట, శరీర దుర్వాసన బెడద అసలేమాత్రం వుండవు.
 • రెడ్ మీట్ ( బీఫ్, మటన్ వంటివి) తీసుకునేవారిలో చెమట బెడద యెక్కువ. అందుకే వారు వైట్  మీట్ (చికెన్, టర్కీ వంటివి)కు మారటం అవసరం.
 • ఈ వేసవిలో టీ, కాఫీ కు బదులుగా హెర్బల్ టీ తాగితే  శరీర దుర్వాసనకు కారణం అయ్యే బ్యాక్టీరియా  తొలగి పోతుంది.
 • పచ్చికూరగాయలు రోజూ తింటే శరీర దుర్వాసన సమస్య ఉండదు. తులసి, కొత్తిమీర తరుగును ఆహారంలో చేర్చినా శరీర దుర్వాసన తగ్గుతుంది.
 • బాదం పప్పులో ఎక్కువగా ఉండే మెగ్నీషియం జీర్ణవ్యవస్థ పనితీరును, రోగ నిరోధక శక్తిని మెరుగు పరచి చెమట సమస్యను అదుపులోకి తెస్తుంది. బాదం పప్పు కొనలేని వారు దానికి  ప్రత్యామ్నాయంగా గుమ్మడి గింజలు, ఆకుకూరలు, సోయా వంటివాటిని తీసుకున్నా చాలు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE