రెండేళ్ళు నిండిన పిల్లల మొదలు కొత్తగా బడి బాట పట్టిన చిన్నారుల ఆహారం విషయంలో పెద్దలకు కాస్త కంగారుగా ఉంటుంది. ఈ విషయంలో పోషకాహార నిపుణులు చెబుతున్న సలహాల గురించి తెలుసుకుందాం.

 • మూడో ఏడు వచ్చేనాటికి స్వయంగా కలుపుకొని తినే అలవాటు చేయాలి.
 • పిల్లలు టీవీ చూస్తూ, పేపర్ చదువుతూ భోజనం చేయనివ్వకూడదు. సౌకర్యంగా కూర్చొని, కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ భోజనం చేసేలా చూడాలి.
 • కొత్తగా బడిలో చేరుతున్న పిల్లలకు లంచ్ బాక్స్ ఎలా విప్పాలి, ఎలా తినాలి వంటి అంశాలమీద ముందు నుంచే తర్ఫీదు ఇవ్వాలి.
 • పిల్లలకు పాలు, పండ్లు, గింజలతో కూడిన అల్పాహారం రోజూ క్రమంతప్పక అందించాలి. బడి నుంచి ఇంటికి వచ్చాక ఉడికించిన గుడ్డు, గింజలు, ఆమ్లెట్, పల్లీలు, పండ్లు వంటివి చిరుతిండిగా అందించాలి.
 • కొత్త వంటకాలను లంచ్ బాక్స్ లో పెట్టకపోవటమే మంచిది. అలాంటి వంటకాలను డిన్నర్లో వడ్డించి వాటిని ఎలా తినాలి? దాని విశేషాలను పిల్లలకు వివరిస్తే త్వరగా దానికి అలవాటుపడతారు.
 • పిల్లలకు డబ్బాలలో నిల్వ ఉంచిన రెడీమేడ్ ఆహారానికి బదులు పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు వంటివి ఇవ్వాలి.
 • బరువు పెరుగుతారనే అపోహను పక్కన బెట్టి పిల్లల ఆహారంలో తగినంతగా వెన్న, నెయ్యి వంటివి ఉండేలా చూడాలి.
 • పిల్లలు రోజూ 5 నుంచి 8 గ్లాసుల మంచినీరు తాగేలా చూడటంతో బాటు కనీసం 45 నిమిషాలు ఆడుకునేలా చూడాలి.
 • పిల్లలు ఆకలి తీరిన మేరకు ఆహారం తీసుకోవటం తప్పనిసరి. రవ్వంత ఒళ్ళు చేస్తున్నారనగానే ఆహారం తగ్గించటం సరికాదు.
 • కంచంలో వడ్డించిన వంటకాలన్నీ తినాలనే నిబంధన పెట్టటం కంటే ఇష్టమైన వాటినే వడ్డించుకొని తినేలా చూడాలి.
 • పిల్లలకు లాలీపాప్, చాక్లెట్స్ వంటి బరువు పెరిగేవి బహుమతులుగా ఇచ్చేబదులు మరింత ప్రత్యామ్నాయాలు అన్వేషించటం మంచిది.
 • పిల్లల ఆహారం విషయంలో ఎలాంటి సమస్య వచ్చినా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE