ఉదయం నిద్ర లేవగానే ఓ కప్పుడు టీ పడితే గానీ ఏ పనీ చేయబుద్ధి కాదు. ఇంకా చెప్పాలంటే అది లేకుండా రోజే మొదలు కాదు. ఏ కారణం చేతైనా టీ తాగటం ఆలస్యమైతే ఏదో తెలియని వెలితి. మనసుకు కూసింత హాయితో బాటు రోజువారీ పనిలో దిగేందుకు కావలసిన ఉత్సాహాన్ని ఇచ్చే తేనీటితో మన అనుబంధమిది. అయితే ఇటీవలికాలంలో సంప్రదాయ తేనీటి స్థానాన్ని గ్రీన్ టీ ఆక్రమిస్తోంది. రుచికంటే ఆరోగ్యమే ముఖ్యమనే సృహ కూడా పెరగటంతో గ్రీన్ టీ వినియోగం బాగా పెరుగుతోంది.

ప్రపంచపు అత్యుత్తమ పోషక విలువలున్న పానీయంగా గ్రీన్ టీ గుర్తింపు పొందింది. కాసిన్ని వేడినీళ్ళు కాచుకొనే వెసులుబాటు ఉన్న ప్రతిచోటా దీన్ని కలుపుకోవచ్చు. పాలు కలిపి చేసుకునే టీ కంటే ఇది పదిరెట్లు చౌక. తేయాకు రంగును బట్టి దానిని ఆయా పేర్లతో పిలుస్తారు. తేయాకు పండించే నేల, అక్కడి వాతావరణం, తీసుకునే సంరక్షణను బట్టి తేయాకు రుచి, రంగు ఆధారపడి ఉంటుంది. ఇది ఆకుపచ్చ రంగులో ఉంది గనుక దీన్ని గ్రీన్ టీ అంటున్నాం. కామెల్లియా సెనెన్సిస్ దీని శాస్త్రీయ నామం. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో తేయాకు రకాలు సాగులో ఉన్నప్పటికీ ఆకుపచ్చ, లేత పసుపు రకాలు మేలైనవిగా పరిగణిస్తారు.

ఎందుకింత ప్రత్యేకం?

గ్రీన్ టీ లోని కెటాచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరపు రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. గ్రీన్ టీ లో అధికంగా ఉండే ఈజీసీజీ అనే కెటాచిన్ కేన్సర్, మధుమేహం రాకుండా చూస్తాయి. ఇవి  కాలేయాన్ని కూడా శుభ్రపరుస్తాయి. మిగిలిన రకాల తేయాకును శుద్ధి చేసే క్రమంలో ఈ  కెటాచిన్ తొలగిపోయినా గ్రీన్ టీ విషయంలో మాత్రం అలా జరగదు గనకే గ్రీన్ టీ తాగిన వెంటనే శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. గ్రీన్ టీ, కొన్ని ఔషధ మూలికలు కలిపి చేసే హెర్బల్ టీని పలు దేశాల్లో ఔషధంగా వాడతారు.

ఉపయోగాలు

 • రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగేవారిలో హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం చాలా తక్కువ. చెడు కొలెస్ట్రాల్ కూడా దరిచేరదు.
 • గ్రీన్ టీ గుండెలోని ఎండో థెలియం పొరను కాపాడి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.
 • శారీరక శ్రమ లేని వారు రోజూ గ్రీన్ టీ తాగితే అధిక క్యాలరీల గొడవ ఉండదు.
 • ఆరోగ్యంతో బాటు గ్రీన్ టీ చర్మ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేస్తుంది.3 చెంచాల మయోనైజ్, చెంచా గ్రీన్ టీ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడుక్కొంటే చర్మానికి బిగువు రావటమే గాక మొటిమల బెడద కూడా తొలగిపోతుంది.
 • రోజూ వాడే ఫేస్ క్రీమ్ లో గ్రీన్ టీ పొడి కలిపి ముద్దగా చేసి ముఖ చర్మంలోకి ఇంకేలా వలయాకారంలో మర్దన చేసి ఆరిన తర్వాత ముఖాన్ని నీటితో కడిగితే చర్మం మెరిసిపోతుంది.
 • ఊబకాయులు ఆకలి వేసినప్పుడు ఓ అరకప్పు గ్రీన్ టీ తాగితే ఆకలి తగ్గి తక్కువ ఆహారం తీసుకొంటారు. భోజనం తర్వాత మరో అరా కప్పు తీసుకుంటే అదనపు కొవ్వు కరుగుతుంది.
 • గ్రీన్ టీ శరీరం లో కార్బోహైడ్రేట్స్ విడుదలను ఆలస్యం చేసి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. కొవ్వు కణాల్లో చక్కెర చేరకుండా చేస్తుంది.
 • మధుమేహులు రోజుకో రెండు కప్పులు గ్రీన్ టీ తాగితే సమస్య అదుపులో ఉంటుంది. వంశపారంపర్యంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటే రోజుకో 2 కప్పులు గ్రీన్ టీ తాగితే మధుమేహం రావటం ఆలస్యం అవుతుంది.
 • పెద్దపెగుల్లోని హానికారక బ్యాక్టీరియాను ఎదుర్కోవటమే గాక గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలకూ విరుగుడుగా పనిచేస్తుంది.
 • కేన్సర్ నివారిణిగా పనిచేస్తూనే, కేన్సర్ రోగుల్లో ఆరోగ్యకరమైన కణాలను బలోపేతం చేస్తుంది.
 • శరీరంలోని ఫ్రీ రాడికల్స్ పీచమణచి ఒత్తిడి నుంచి విముక్తం చేస్తుంది.
 • పొగ తాగాలనే కోరికను గ్రీన్ టీ గణనీయంగా తగ్గిస్తుంది.
 • మెదడులోని రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడకుండా చూస్తుంది. వృద్దుల్లో అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.
 • ఎముకల బలోపేతానికి దోహదపడుతుంది. కీళ్ళ నొప్పులను దూరం చేస్తుంది.

 Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE

A PHP Error was encountered

Severity: Core Warning

Message: PHP Startup: Unable to load dynamic library 'C:\Program Files\PHP\v7.0\ext\php_wincache.dll' - The specified module could not be found.

Filename: Unknown

Line Number: 0

Backtrace: