తీపి అంటే ఇష్టం. కానీ మధుమేహం కారణంగా రవ్వంత మిఠాయి తినలేరు. చివరికి తేనీరు, కాఫీ కూడా చక్కెర లేకుండానే. కాస్త అదనంగా తింటే రక్తంలో చక్కెర నిల్వలు పెరగటం, తినటం కాస్త ఆలస్యం అయితే చక్కెర స్థాయిలు    పడిపోవటం వంటి తలనొప్పులు. ఇలా మధుమేహుల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ మధుమేహుల సమస్యలకు భారతీయ సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదంలో మంచి మందులున్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది మధుపత్రి. దీనికి సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. 

    మధుపత్రిని ఆంగ్లంలో స్టీవియా అంటారు. దీని ఆకు చక్కెర కంటే 4 రెట్లు తీయగా ఉంటుంది. మధుపత్రి ఆకుల నుంచి తయారు చేసిన చక్కెరను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు ఆహారపదార్థాల, పానీయాల తయారీలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. ఒక చెంచా మధుపత్రి ఆకుల నుంచి తయారు చేసిన చక్కెర, ఒక కప్పు పంచదారతో సమానం. ఇంత తీయగా ఉన్నప్పటికీ ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను ఏమాత్రం ప్రభావితం చేయదు. సుమారు 1500 సంవత్సరాల క్రితమే దక్షిణ అమెరికాలో స్టీవియా ఆకుల వినియోగం కనిపిస్తుంది. జపాన్, చైనా, థాయ్‌లాండ్‌, మలేషియా, తైవాన్‌ వంటి దేశాలలో దీనిని విరివిగా సాగు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థల గుర్తింపు కూడా లభించటంతో మరిన్ని దేశాల్లో దీని వినియోగం పెరుగుతోంది.

చూడటానికి పుదీనా మాదిరి కనిపించే మధుపత్రిని ఇంట్లోనూ పెంచుకోవచ్చు. మధుమేహులు భోజనానికి 20 నిమిషాల ముందు ఈ ఆకులను నమిలితే తీపి తిన్నాఎలాంటి ఇబ్బంది రాదు. ఈ మొక్కలను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. మధుపత్రి మధుమేహ వ్యాధితోపాటు అధిక రక్తపోటు, దంత సమస్యలు, గ్యాస్‌, అల్సర్ కారక సమస్యలు, హృదయ సంబంధిత సమస్యలు, ఊబకాయం, చర్మ వ్యాధులను ఎదుర్కొనే లక్షణాలున్నాయని పలు పరిశోధనల్లో రుజువైంది. తమలపాకుల మాదిరిగా బుగ్గన పెట్టుకుని చప్పరిస్తే నోటి క్యాన్సర్‌ వంటి వ్యాధులు నివారించవచ్చు. నోటి దుర్వాసన పోగొట్టే మౌత్‌ ఫ్రెష్‌నర్‌గా కూడా దీనిని వాడుతున్నారు. 

మధుపత్రి తింటే శరీరంలో ఎటువంటి అదనపు క్యాలరీలు చేరవు. రక్తంలోని పెరిగిన గ్లూకోజ్‌ నిల్వలను తగ్గించి గ్లూకోజ్‌ శాతాన్ని క్రమబద్ధీకరించడంలో ఇది అమోఘంగా పనిచేస్తుంది. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సమర్థవంతంగా  పనిచేస్తాయని తేలింది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE