వంటకు రుచిని తెచ్చే టమోటాని ఇష్టపడనివారు అరుదే.  పుల్లని పండ్లతో పోటీగా  టమోటాలో  బోలెడంత  విటమిన్‌ సి ఉంటుంది. రోజూ ఆహారంలో భాగంగా టమోటా తినేవారిలో అజీర్తి, రోగనిరోధక శక్తి లోపాలు దరిచేరవనేది నిపుణుల మాట. టమోటాలోని విటమిన్ ఏ మూలంగా కంటి చూపు ఎంతగానో మెరుగుపడుతుంది. దంతాల పటుత్వానికీ ఇదెంతగానో దోహదపడుతుంది. టమోటాలోని క్యాల్షియం, ఫాస్ఫరస్‌ వంటి కీలక పోషకాలు రక్తాన్ని శుభ్ర పరుస్తాయి.శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలూ ఇందులో పుష్కలంగా  ఉంటాయి. దీనిలోని విటమిన్లు కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. కాలేయంలోని క్రిములను నిర్మూలించడంలో టమోటాలోని విటమిన్లు ఎంతగానో దోహదపడుతాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే  రోజూ టమోటా తినేవారిలో ప్రేమ, వాత్సల్యం, క్షమించే లక్షణం పెరుగుతాయట. ఈ విషయం శాస్త్రీయంగా నిరూపితమైంది.  ప్రతిచిన్న విషయానికీ కోప్పడేవారూ రోజూ టమోటో తింటే కోపం దూరమవుతుందట. వినటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఇంకెందుకాలస్యం.. ఈ రోజునుంచే టమోటా తినటం మొదలుపెడదాం.. కోపాన్ని జయిద్దాం.



Recent Stories







bpositivetelugu

చిన్నారుల్లో మానసిక ఒత్తిళ్లు

విషాదాలు మనుషులను చెప్పలేంతగా కుంగదీస్తాయి. వీటి ప్రభావాల నుంచి బయటపడేందుకు ఒక్కోసారి ఏళ్ళ సమయమూ

MORE
bpositivetelugu

జంటనగరాల బోనాల వేడుకలు

ఆషాఢమాసపు బోనాల ఆధ్యాత్మిక శోభతో యావత్ తెలంగాణా వెలుగుతోంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ,

MORE