ఆధునిక యుగంలో జీవన వేగం పెరిగే కొద్దీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతూ పోతోంది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పలు అనారోగ్య సమస్యలకు ఈ ఒత్తిడే ప్రధాన కారణం. అయితే పాలు, పాలపదార్థాలు, పండ్లు, కూరగాయల సాయంతో ఈ ఒత్తిడిని సులువుగానే అధిగమించవచ్చు. రోజువారీ ఆహారంతో మానసిక ఒత్తిడిని ఎదుర్కోవటం ఎలాగో తెలుసుకుందాం. 

  • రోజూ నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తాగితే అందులోని ల్యాక్టోస్‌ మూలంగా సుఖనిద్ర, తద్వారా మెదడు పనితీరు పెరుగుతాయి.
  • అలవాటుగా పెరుగు తినటం వల్ల తగినంత విటమిన్‌ బి అంది మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.
  • ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు శరీరంలో హార్మోన్లలో మార్పులు వస్తాయి. అందుకు విటమిన్ సి చక్కని విరుగుడుగా పనిచేస్తుంది.అందుకే అది లభించే నిమ్మ, నారింజ, కమలా, బత్తాయి వంటి పండ్లు తరచూ  తినాలి.    
  • రోజుకో అరటిపండు తింటే ఒత్తిడి గురించి మరిచి పోవచ్చు. ఇందులోని అధిక క్యాలరీలు, మెగ్నీషియం మానసిక ఒత్తిడిని వేగంగా, సులభంగా తగ్గిస్తాయి.
  • శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను, హానికారక పదార్థాలను బొప్పాయిలోని కెరోటిన్‌ తొలగించి శరీరం, మనస్సు తేలికపడేలా చేస్తుంది.
  • యాప్రికోట్‌లో ఉండే కెరోటిన్‌ మూలంగా మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.
  • ఒత్తిడిని ఎదుర్కొనేవారు బంగాళదుంప తీసుకుంటే మంచిది. దీనిలోని తగినంత జింక్‌, విటమిన్‌ సి మూలంగా రోగని రోధకశక్తి పెరిగి మానసిక ఉల్లాసం కలుగుతుంది.
  • గోంగూర వంటి ఆకుకూరలు, గోధుమ రొట్టెలు తరచూ తినేవారికి తగినంత ఐరన్‌ అంది, తద్వారా మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుంది. దీనివల్ల ఒత్తిడి, వ్యాకులతలు తొలగిపోతాయి.
  • చేపల్లోని ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు పలురకాల మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తాయి.
  • ఒత్తిడికి చాక్లెట్‌ దివ్యమైన ఔషధం. దీనిలోని ఫెనిలెథిలమైన్‌ (పిఇఎ) శరీరంలోని ఎండార్ఫిన్‌ స్థాయిల్ని నియంత్రించి ఒత్తిడిని మటుమాయం చేస్తుంది.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE