'తిండిగలిగితే కండగలదోయ్.. కండగలవాడే మనిషోయ్' అనే గురజాడ వారి మాట వినని తెలుగు వాడుండడు. అయితే మనం ఇప్పుడు తీసుకుంటున్న ఆహారం ఆయన చెప్పినట్లు కండనిచ్చేదేనా అంటే కాదనే చెప్పాలి. మారిన అవసరాలు, ఆలోచనల పర్యవసానంగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహారిణుల వినియోగం పెరిగిపోవటంతో గతానికి భిన్నంగా నీరు, గాలి, నేల కాలుష్యం బారిన పడటంతో ఆకలి తీర్చే ఆహారం తప్ప ఆరోగ్యాన్నిచ్చే ఆహారం లభించటం అరుదైన దుస్థితి దాపురించింది. ఈ తరహాలో పండించిన ఆహారం తీసుకోవటం వల్ల పంటకు వాడే పురుగుల మందులు, ఎరువుల అవశేషాలు మనిషి శరీరంలో చేరి అనారోగ్యం పాలు చేస్తున్నాయి.మరోవైపు ఏళ్ళ తరబడి ఈ కృతిమ ఎరువుల వినియోగం కొనసాగి అంతిమంగా భూమి నిస్సారమై పోతోంది. అయితే ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉన్నట్లే దీనికీ ఆర్గానిక్ ఫుడ్ (సేంద్రియ ఆహారం) ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.

అంటే?

ఆర్గానిక్ ఫుడ్ అంటే ఎలాంటి కృత్రిమ ఎరువులు, ఇతర కీటకనాశినులు వాడకుండా పర్యావరణ హితమైన సేంద్రియ విధానంలో సాగుచేసిన ఆహారం అన్నమాట. ఈ విధానంలో విత్తు నాటి కోత కోసే వరకూ ఎక్కడా కృత్రిమ రసాయనాలు వాడటం జరగదు. అడవుల్లో మొక్కలు, జంతువులు మానవ ప్రమేయం లేకుండా పెరిగినట్లుగా ఈ సాగు ఉంటుంది. సాధారణ భూమిలోని రసాయనాలు పోయేలా 2 ఏళ్లపాటు భూమిని ఏ పంట వేయకుండా దున్ని వదిలేయటం చేసి, ఆ తర్వాత ఎరువులుగా పశువుల వ్యర్ధాలు, పురుగుమందుల బదులు వేపనూనె, కషాయం వంటివి వాడి పంట సాగు చేస్తారు. అయితే సాధారణ సాగు కంటే సేంద్రియ సాగు చేసేందుకయ్యే ఖర్చు అధికం కావటం, దిగుబడి తక్కువగా ఉండటం వంటి పలు కారణాల వల్ల ఆర్గానిక్ ఆహారంధర 3 రెట్లు అధికంగా ఉంటుంది గనుక సామాన్యులు దీనిని కొనలేరు. అందుకే గ్రామాల్లోని వారు పెరడు, పట్టణ వాసులు ఇంటి వరండాల్లో, పై కప్పు మీద కుండీల్లోనూ కూరగాయ, ఆకుకూర మొక్కలు పెంచుకోగలిగితే పైసా ఖర్చు లేకుండా ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE