ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల ఆహారపుటలవాట్లు ఉన్నప్పటికీ ప్రకృతి సిద్దమైన సహజాహారమే అత్యుత్తమ ఆహారం. ఇలాంటి  ఆహారం తీసుకోవటం వలనే మన పూర్వీకులు 90 ఏళ్ళు పైబడి  సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలిగారు. ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్దమైన ఆహారాన్ని తీసుకోవటం, క్రమబద్దమైన జీవితాన్ని గడపటమే వారి ఆరోగ్యం వెనకదాగున్న అసలు రహస్యం. అయితే  ఆధునిక మానవుడు ఈ నియమాలను  త్రుణీకరించటం మూలంగా 30 ఏళ్ళు వచ్చేసరికే రోగాలపాలవుతున్నాడు. అందుకే ఇప్పటికైనా ప్రకృతి వైద్యంలోని ఆహార నియమాలను పాటించగలిగితే ఆరోగ్య భారతమనే కల సాకారం అవుతుంది. ప్రకృతి వైద్యం సూచించే సహజాహార నియమాల గురించి తెలుసుకుందాం. 

 • ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటిలో ఉప్పు ప్రధానమైనది. ఇది ఏ మాత్రం మోతాదు ఎక్కువైనా విషంతో సమానమే. అందుకే రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగాన్నిపూర్తిగా, లేక కనిష్ట స్థాయికి తగ్గించాలి. కూరలలో వేసే ఉప్పు శారీరక అవసరాలకు సరిపోతుంది గనుక పెరుగు, మజ్జిగ, సలాడ్స్ లలో ఉప్పు అదనంగా కలుపుకోవటం మానేయాలి. ఉప్పు, నూనె అతిగా ఉండే ఊరగాయలు అసలు ముట్టుకోవద్దు.
 • వీలున్నంత మేరకు ముడి బియ్యం, ముడి గోధుమల పిండి వాడటం శ్రేయస్కరం. రుచి కోసమని అతిగా పాలిష్ పట్టిన బియ్యం తినటమే మధుమేహానికి దారితీస్తోంది. నూనె లేకుండా కాల్చిన రొట్టె, పుల్కాలు, ముడి బియ్యం అన్నం రోజుకు 2 సార్లు మితంగా తీసుకోవచ్చు.
 • ప్రకృతి మనకు ఇచిన పప్పులు, గింజలు (వేరుశనగ, నువ్వులు వగైరా) వంటి వాటిని ఆహారంగా తీసుకుంటే మనకు అవసరమైన పరిమాణంలో కొవ్వు అందినట్లే. ఇంకా అవసరం అనుకుంటే 1 లేదా 2 చెంచాలు నూనె వాడొచ్చు గానీ అదేపనిగా నూనె వాడటం పనికిరాదు.
 • తీయని రుచితో మరపిస్తూ ఆరోగ్యాన్ని చెప్పలేనంత దెబ్బతీసే మరో పదార్ధం పంచదార. దీని వాడకాన్ని పూర్తిగా ఆపాలి. కావాలనుకుంటే బెల్లం, తేనె, ఖర్జూరపు పొడి వాడొచ్చు.
 • రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా మొలకలు, పండ్లు, ఆవిరి మీద వండిన కూరలు ఉండాల్సిందే.
 • అల్పాహారంగా ప్రకృతి ప్రసాదించిన పండ్లు, మొలకలు, కూరగాయలు అత్యత్తమ ప్రత్యామ్నాయాలు. రాగి సంకటి, జావ వంటివీ మంచిదే గానీ ఇడ్లి, దోశ, పూరి జోలికి మాత్రం పోనేవద్దు.
 • సాయంకాలం 7 గంటల సమయానికి రాత్రి భోజనం ముగించాలి.
 • వీలున్నన్ని మంచి నీళ్ళు తాగటం ఆరోగ్యానికి ఎంతగానో అవసరం. ఉదయం  సూర్యోదయానికి ముందే  నిద్ర లేచి 1 లీటరు నీరు తాగటం, భోజనానికి 1 గంట ముందు ఒక లీటరు, తిన్న గంట తర్వాత మరో లీటరు మంచినీరు తాగాలి.
 • కూరగాయల, పండ్ల సాగులో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం ఎక్కువైన నేపధ్యంలో గంటసేపు వాటిని ఉప్పు నీటిలో వేసి తీసి బాగా కడిగి వాడాలి.
 • పులుపు కోసం నిమ్మ ఉప్పు వంటివి పక్కనబెట్టి నిమ్మ రసం, ఉసిరి, చింత కాయలు, మామిడికాయలు వాడుకోవాలి.
 • ఎండుకారం, ఎండు మిరపకాయలకు బదులు పచ్చి మిరపకాయలు వాడుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE