పాలకూర, ఫ్రూట్ సలాడ్ తయారీ తయ్యరీ విధానం మీకోసం అందిస్తున్నాము. రుచికరమైన ఈ సలాడ్ ని మీ ఇంట్లోనే తయ్యారుచేసుకొని ఆనందించండి! 

సలాడ్ కోసం కావలసిన పధార్ధాలు: 

పాలకూర తరుగు -  3 కప్పులు

1 చిన్న దోసకాయ    -  కడిగి,చిన్న చతురస్రాలుగా తరగాలి

1 చిన్న ఆపిల్       - కడిగి,చిన్న చతురస్రాలుగా తరగాలి

వేయించిన వేరుశనగ బద్దలు  -  పావు కప్పు

జీడిపప్పు పలుకులు - పావు  కప్పు

తాజా కొత్తిమీర  తరుగు -  చెంచాడు

1 చిన్న కమలా పండు - ఒలిచి, చిన్న ముక్కలుగా తరగాలి

ఎండుద్రాక్ష           - పావు కప్పు

డ్రెస్సింగ్ కోసం కమలా పండు – 1

నిమ్మకాయ – 1

తేనె - 2 చెంచాలు

ఆలివ్ ఆయిల్ - అర కప్పు

నూరిన నల్ల మిరియాలు, ఉప్పు- తగినంత 

తయారీ   

ముందుగా ఒక గిన్నెలో పాలకూర తరుగు, దోసకాయ,ఆపిల్ ముక్కలు,వేరు సెనగ, బాదం పలుకులు, కొత్తిమీర వేసి  కలపాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో డ్రెస్సింగ్ కోసం కమలా, నిమ్మ రసం తీసుకొని అందులో తేనె, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి అందులో సన్నని ధారలా ఆలివ్ నూనెను ఈ మిశ్రమంలో బాగా కలిసేంతవరకు కలపండి. వేరొక గిన్నెలో ఈ రెంటినీ వేసి  బాగా కలిపి చివరగా, ఎండుద్రాక్ష ఇంకా  కమలా ముక్కలు పైన అందంగా చల్లి  అందరికి వడ్డించటమే.

 



Recent Stories







bpositivetelugu

పరిమళాల వాడకంలో మెళకువలు

మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ విషయంలో ముందుంటారు.

MORE
bpositivetelugu

రంజాన్ దాన, ఉపవాసాల విశేషాలు

ఏ పండుగైనా శాంతిని, మానవాళి హితాన్నే ప్రబోధిస్తుంది. రంజాన్ (రమదాన్) పండుగా ఇదేవిషయాన్ని చెబుతోంది. ఇస్లామీయ కేలండర్లో

MORE