ఉలవలు పప్పుజాతికి చెందిన పంట. నవ ధాన్యాల్లో ఒకటి. ఉలవ గుగ్గిళ్ళు, ఉలవచారు తెలుగు వారికి అత్యంత ప్రియమైన వంటకాలు. ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. మేలైన ఆహారంగానే గాక పశువుల దాణాలోనూ ఉలవల వినియోగం విరివిగా కనిపిస్తుంది. ఉలవలకు పలు రకాల అనారోగ్యాలను తరిమికొట్టే గుణం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ అధ్యయనం ప్రకారం ఉలవల్లో మధుమేహాన్ని నియంత్రించే గుణం ఉన్నట్లు తేలింది. అయితే మారిన జీవన శైలితో బాటు మారిన ఆహారపుటలవాట్ల కారణంగా నేటితరంలో ఉలవల ప్రాముఖ్యం గురించి తెలిసిన వారు బహుకొద్దిమందేనని చెప్పాలి. మేలైన పోషకాహారంగా, చక్కని ఔషధంగా ఉలవలు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉపయోగాలు ..

 • ఉలవలు తింటే రవ్వంత కూడా కొవ్వు చేరదు. అందుకే అన్ని వయసుల వారూ నిశ్చింతగా వీటిని తినొచ్చు. ప్రతి 100 గ్రాముల ఉలవగుగ్గిళ్లలో 321 కేలరీలశక్తితోపాటు 22 గ్రాముల ప్రొటీన్లు, 57 గ్రాముల కార్బొహైడ్రేడ్లు, 287 మిల్లీగ్రాముల కాల్షియం, 311 మి.గ్రా. ఫాస్ఫర్‌సలతో పాటు బోలెడంత పీచుపదార్థమూ లభిస్తుంది. అందుకే ఎదిగే వయసు పిల్లలకు ఉలవలకు మించిన మేలైన పోషకాహారం మరొకటి లేదు.
 • ఉలవలను నేరుగా తినేదాని కంటే ఉడికించి, మొలకలెత్తించి లేదా వేయించి పొట్టు తీసితిన్నప్పుడు పోషకాల విలువ మరింత పెరుగుతుంది.
 • ఉలవలకు ఆకలిని పెంచే శక్తి ఉంది. అందుకే దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకొన్నవారు తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.
 • ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి, గట్టిపడిన కఫాన్ని పలుచబరచటంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి.
 • అకారణంగా కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలున్న వారు ఉలవలతో చేసిన అహారం తీసుకుంటే చక్కని గుణం కనిపిస్తుంది.
 • మూత్రాశయంలో రాళ్లతో బాధపడేవారు ఉలవలు తింటే త్వరలోనే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. మూత్ర సమస్యలు ఉన్నవారు ఒక కప్పు చొప్పున ఉలవచారు, కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం కలుగుతుంది.
 • వేసవిలో సెగ గడ్డల సమస్య ఎదురైతే ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపు కలిపి పై పూతగా వేస్తే మరునాటికి గడ్డ సమసిపోతుంది .
 • ఊబకాయానికి ఉలవలు మించిన ఔషధం లేనేలేదు. కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు పోసి నానబెట్టి కుక్కర్‌లో ఉడికించి, ఆ ఉలవకట్టుకు చిటికెడు ఉప్పు కలిపిఉదయం పరగడుపునే తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు.
 • మేలైన ఉలవలను సన్నటి సెగమీద లేతగా వేయించి, చల్లారిన తరువాత పిండిపట్టుకొని రోజూ పరగడుపున రెండు చెంచాల పొడిని గ్లాసుడు నీళ్లలోకి వేసుకుని తాగితే బరువు తగ్గుతారు.
 • ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకునే మహిళల్లో నెలసరి రాకపోవటం, క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు.
 • ఉలవలు దెబ్బతిన్న కాలేయాన్ని కోలుకునేలా చేస్తాయి.

గమనికలు 

 • అదేపనిగా రోజూ ఉలవలు తినటం వల్ల వేడిచేయవచ్చు. అందుకే ఉలవలు తిన్నరోజున తగినంత మజ్జిగ కూడా పుచ్చుకుంటే ఈ సమస్య రాదు.
 • ఉలవలను కనీసం 8 గంటల పాటు నానబెడితేనే పూర్తిగా నానతాయి గనుక ఎలాంటి హడావుడి లేని రోజుల్లో ఉలవల వంటకాలు చేసుకోవాలి . Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE