ఆరోగ్యానికి రాగులు ఎంత మంచివో మనకు తెలుసు. లెక్కకు మించిన పోషకాలున్న ఈ తృణ ధాన్యం తో రాగి సంకటి, రాగి జావ వంటి వంటకాలతో బాటు రొట్టె కూడా చేసుకోవచ్చు. తక్కువ ధరలో, సమయంలో,  సులభంగా చేసుకోదగిన బలమైన అల్పాహారమిది.

100 గ్రాముల రాగి పిండిలో 336 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 80 శాతం కార్బోహైడ్రేట్లే. 12 శాతం తేమ ఉంటుంది. వంద గ్రాముల రాగిపిండిలో 350 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అందుకే ఎముకల ఆరోగ్యానికీ, పటిష్టతకూ రాగిపిండి మేలు చేస్తుంది. కొంత ఐరన్ కూడా ఉంటుంది. రాగిపిండిలో అత్యావశ్యకమైన అమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

కావలసినవి

రాగి పిండి - 1 పెద్ద కప్పు(150 గ్రాములు)

ఉల్లికాడ తరుగు - 4 చెంచాలు

ఉల్లి తరుగు - 4 చెంచాలు

పచ్చి మిర్చి  తరుగు - చెంచాడు

కారట్ తురుము - గుప్పెడు

ఉప్పు -  రుచికి తగినంత

నెయ్యి లేదా నూనె - రొట్టె కాల్చటానికి సరిపడా 

చేసే పద్ధతి

 గిన్నెలో రాగిపిండి, ఉల్లి కాడల తరుగు, ఉల్లి తరుగు, కారట్ తురుము,పచ్చిమిర్చి ముక్కలు,ఉప్పువేసి వేడి నీళ్ళుపోస్తూ చపాతీపిండిలాగా గట్టిగా కలపాలి. అరగంట పాటు  నాననిచ్చి కాస్త గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసి పెనంపై రెండు వైపులా నెయ్యి కానీ,నూనె కానీ వేసి గోధుమ రంగు చుక్కలు వచ్చేవరకు కాల్చాలి. ఏదైనా కూరతో దీన్ని వేడి వేడిగా తినొచ్చు.Recent Storiesbpositivetelugu

పరిమళాల వాడకంలో మెళకువలు

మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ విషయంలో ముందుంటారు.

MORE
bpositivetelugu

రంజాన్ దాన, ఉపవాసాల విశేషాలు

ఏ పండుగైనా శాంతిని, మానవాళి హితాన్నే ప్రబోధిస్తుంది. రంజాన్ (రమదాన్) పండుగా ఇదేవిషయాన్ని చెబుతోంది. ఇస్లామీయ కేలండర్లో

MORE