వర్షాకాలంలో సాయంత్రం పూట వేడివేడిగా మసాలా పకోడీ తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేము. ఇంట్లోనే సులభంగా, త్వరగా చేసుకోదగిన మసాలా పకోడీని  మీరూ ఓసారి ట్రై చేయండి.

కావసిన పదార్ధాలు 

సెనగపిండి - 2 కప్పులు

ఉల్లిపాయలు - 4 పెద్దవి(నిలువుగా తరగాలి)

పచ్చి మిర్చి - 4

ఉప్పు - రుచికి సరిపడా 

అల్లం, వెల్లుల్లి మిశ్రమం -  చెంచా

సోడా ఉప్పు - చిటికెడు

గరం మసాలా - చెంచా

కొత్తిమీర- చెంచాడు (గార్నిష్ కోసం)

చేసే పద్దతి 

ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి మిశ్రమం, ఉప్పు , మసాలా, సోడా ఉప్పు కలుపుకుని అందులో కొద్దీ కొద్దిగా  నీళ్ళు పోస్తూ కొంచెం కొంచెంగా సెనగపిండి కలుపుకోవాలి.ఈ మిశ్రమం జారుడు జారుడుగా గాక గట్టిగా ఉండాలి.  తరువాత మూకుడులో నూనె పోసి కాగాక పకోడిలను వేయించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సాస్ అద్దుకొని  తింటే చాలా రుచిగా ఉంటాయి.



Recent Stories







bpositivetelugu

పిల్లల చదువులో పెద్దల పాత్ర

 గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE