పోషకాహారం, ఆరోగ్యం ఈ రెండూ కవలపిల్లల్ల వంటివి. శరీరం విధులు నిర్వహించేందుకు కావలసిన శక్తిని అందిస్తూ ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండడానికి, రోగాలతో పోరాడడానికి అవసరమయ్యే శక్తిని అందించేదే నిజమైన పోషకాహారం. ఎదిగేవయసులో  పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది. మనదేశంలో సరిపడినన్నిఆహార నిల్వలు ఉన్నప్పటికీ చాలామంది  చిన్నారులు, ఎదిగేవయసు  పిల్లలు, మహిళలు ఈ సమస్య బారినపడుతున్నారు. దీనిని  కీలక అంశంగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ నెల మొదటి వారాన్ని జాతీయ పౌష్టికాహార వారోత్సవాల పేరిట జరుపుతోంది. తద్వారా ఈ సమస్య పట్ల తగిన అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

పిల్లల్లో పోషకాహార లోపం..

మన దేశంలో పోషకాహారం అంటే ఉన్నంతలో మంచి ఆహారమనే అర్థం. ఈ అపోహ కారణంగానే  పిల్లల  పోషకాహార లోపాన్ని తల్లిదండ్రులు సాధారణంగా గుర్తించలేరు. నిజానికి అదే వయసు గల పిల్లలతో పోలిస్తే తగినంత బరువు, ఎత్తు లేని పిల్లలు సమస్య బాధితులేనని చెప్పొచ్చు. సమస్యను ముందే గుర్తించి తగు చర్యలు తీసుకోకపోతే పిల్లలు తీవ్ర పోషకాహార లోపం బారిన పడి క్షయ, మశూచి, న్యమోనియా, ప్రేగు సంబంధమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.

సూచనలు

  • పిల్లల్లో శరీర పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది గనుక వారి ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పోషకాహార లోపం గల పిల్లలకు రెట్టింపు ఆహారం ఇవ్వాలి.
  • ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే మాంసకృత్తులు( ప్రోటీన్స్) విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పసిపిల్లలకు 10గ్రాములు, హైస్కూల్ స్థాయి పిల్లలకు 35 గ్రాముల ప్రొటీన్ అందేలా చూడాలి.
  • రోజువారీ ఆహారంలో కూరగాయలు, పప్పు ధాన్యాలు, గుడ్డు, పండ్లు ఉండేలా చూడాలి. పిల్లలకు మాంసాహారం కంటే శాకాహారం ద్వారానే ఎక్కువ పోషకాలు అందుతాయని తెలియజేయాలి.

ఎందులో ఎన్ని ప్రోటీన్స్

100 గ్రాముల కందిపప్పులో 22.3గ్రా, పెసరపప్పులో 24.5 గ్రా, శనగపప్పులో 17.1 గ్రా, మినప్పప్పులో 24 గ్రా, సోయాలో 43.2 గ్రా, వేరుశనగ గింజల్లో 26.7 గ్రా. ప్రొటీన్లు ఉంటాయి. మునగాకు, తోటకూర, పుదీనా, మెంతి ఆకు వీటిలో 7 గ్రా. వరకూ ప్రొటీన్లుంటాయి. యాలకుల్లో 10.2గ్రా,  మిరప కారంలో15.9గ్రా, ధనియాల్లో 14.1గ్రా, జీలకర్రలో  18.7గ్రా, మెంతుల్లో 26.2గ్రా, వాములో17.1గ్రా, నల్ల మిరియాల్లో 11.5గ్రాముల ప్రొటీన్లున్నాయి. పాలు, పెరుగు, మజ్జిగల్లో  3-4% ప్రోటీన్లుంటాయి. మాంసంలో కూడా 30-36% ప్రోటీన్లు ఉంటాయి.

ఆహార ప్రణాళిక

పిల్లల ఆహారం విషయంలో దిగువ ప్రణాళికను పాటించగలిగితే చాలావరకు పోషకాహార లోపం రాదు. ఆ వివరాలు..

ఆదివారం చపాతీ,  కోడి మాంసం, డ్రై ఫ్రూట్స్

సోమవారం   అన్నం,  పప్పు, ఆకుకూరలు, పెరుగు

మంగళవారం రొట్టె, వంకాయ కూర, గుడ్లు, మజ్జిగ

బుధవారం   అన్నం, బంగాళదుంపలు, రసం, పాలు, పెరుగు

గురువారం         అన్నం, క్యారెట్, పెరుగు, డ్రై ఫ్రూట్స్

శుక్రవారం         పులగం, గోంగూర, బెల్లం పరమాన్నం, కాయగూరలు, పప్పు   

శనివారం           అన్నం, రాగి సంకటి, కూరగాయలుRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE