మనదేశంలో తులసి లేని ఆలయం గానీ వీధి గానీ కనిపించదు. తులసికి దేవతా స్థానం ఇచ్చిన దేశం మనది. పలు ఔషధ గుణాలున్న కారణంగా ఆరోగ్య ప్రదాయినిగానూ తులసికి మంచి గుర్తింపు ఉంది. తులసి ఆకులు వేసి కాచిన టీ తాగితే రోగనిరోధక శక్తి పెరగటమే గాక వర్షాకాలంలో వచ్చే పలు రుగ్మతలు దూరమవుతాయి. ఇప్పుడు తులసి టీ తయారీ, ఉపయోగాల గురించి తెలుసుకుందాం. 

ఇలా చేద్దాం.. 

కావలసినవి

తులసి ఆకులు - గుప్పెడు

అల్లం - అంగుళం ముక్క (దంచుకోవాలి)

వాము, జీలకర్ర-  చిటికెడు

మిరియాలు -  4 గింజలు

బెల్లం తరుగు - చెంచా

  తయారీ

గిన్నెలో గ్లాసున్నర నీళ్లు పోసి అందులో పై పదార్థాలన్నీ వేసి సగానికి మరిగించి వడపోస్తే బోలెడన్ని ఔషధ గుణాలున్న వేడివేడి తులసి టీ తయారైనట్లే.  

ఉపయోగాలు

  • వర్షాకాలంలో మలేరియా, వైరల్ జ్వరాలకు తులసి టీ విరుగుడుగా పనిచేస్తుంది.
  • తులసి టీ తాగితే జ్వరం తీవ్రత తగ్గటమేగాక జ్వరం తగ్గిన తర్వాత ఉండే నీరసం నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.
  • తులసి టీ రోజూ తాగేవారు మానసిక ఒత్తిడి ప్రభావాన్ని సులభంగా అధిగమించగలరు.
  • తులసి టీ తాగే చిన్నారుల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
  • మరిగే తులసి టీ లో చెంచా అల్లం రసం కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE