సాధారణ అనారోగ్య సమస్యల్లో మలబద్ధకం ప్రధానమైనది. నిజానికి ఇది చిన్న సమస్యే అయినా రోజువారీ జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. జీవన శైలి మార్పులు, వేళ పట్టున తినకపోవడం, ఐరన్ టాబ్లెట్స్ అతిగా వాడటం,వేళకు మల విసర్జనకు వెళ్లే అలవాటు లేకపోవటం, తక్కువ నీరు తాగటం,తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. హైబీపీ, మొలలు, ఫిషర్స్, తలనొప్పి మొదలు పలు జీర్ణాశయ సంబంధిత సమస్యలకు మలబద్ధకమే మూల కారణం.కొన్ని జీవన శైలి మార్పులతో బాటు ముఖ్యంగా పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం ద్వారాఈ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు.

తీసుకోవాల్సిన ఆహారం

 • పీచు ఎక్కువగా ఉండేజామపండును విత్తనాలతో సహా బాగా నమిలి తింటే మలబద్ధక సమస్య నివారించబడుతుంది.
 • రోజూ ఒక ఆపిల్ పండును చెక్కుతీయకుండా నేరుగా తినటం వల్ల పేగుల పనితీరు మెరుగుపడి సమస్య దూరం అవుతుంది.
 • రోజుకి కనీసం ఒక గ్లాసు క్యారెట్‌ రసం తాగితే మలబద్దకం దరిజేరదు.
 • రోజుకు కనీసం ఒకటి లేదా2 కప్పులు అల్లం టీ తాగితేసమస్య నియంత్రణలోకి వస్తుంది.
 • రాత్రి 10 ద్రాక్షపండ్లను నీటిలో నానబెట్టి మరునాటి ఉదయం పండ్లను తిని, ఆ నీరు తాగటమూ సమస్యకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
 • పీచు అధికంగా ఉండే బ్రెడ్‌, చిరు ధాన్యాలు, మొలకెత్తిన గింజలుతినటం వల్లఎంతటి మలబద్దకమైనా తగ్గుతుంది.
 • క్యాల్షియం ఎక్కువగా ఉండే పెరుగు రోజూ తీసుకుంటే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
 • ఉదయం లేవగానే ఒక లీటరు గోరువెచ్చని నీరు తాగాలి . అలాగే రోజుమొత్తంలో కనీసం 10- 15గ్లాసుల నీరు తాగటం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవటమే గాకపేగుల్లో మలం సాఫీగా ముందుకు సాగుతుంది.
 • ఆహారంలో క్యాబేజీ, బొప్పాయి, చిలగడదుంప, కొబ్బరి వంటివాటికి స్థానం కల్పించటం వల్లమలవిసర్జన సాఫీగా సాగుతుంది.
 • రోజూ ఒక గ్లాసు పచ్చి పాలకూర రసం లేదానారింజ, బత్తాయి వంటి రసాలు తీసుకుంటే మలబద్దకం దూరమయ్యేందుకు దోహదపడతాయి.
 • పాలిష్ పట్టిన బియ్యం, గోధుమలు, మైదాకు బదులు ముడి బియ్యం, గోధుమలు,జొన్నపిండి వంటివి వాడితే మలబద్దకం రాదు.
 • రోజువారీ ఆహారంలోఆకుకూరలు, పచ్చి కూరగాయలు, తేనె, పండ్లు, ఎండుఫలాలతో పాటు వెన్న, నెయ్యి వంటి పాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి

ఇతర జాగ్రత్తలు

 • నిలువ పచ్చళ్ళు, మసాలాలు, వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా మానివేయాలి.
 • మద్యపానం అసలే పనికిరాదు.
 • వేళకు తినాలి.టీ, కాఫీలు మానివేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE