బరువు తగ్గాలని చాలామంది ప్రయత్నిస్తారు గానీ అందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేసేవారు మాత్రం కొందరే. అవగాహన లేని కారణంగా చాలామంది తోచిన మేరకు ఓ వారమో లేక 10 రోజులో డైటింగ్చేసి లాభం లేదని మధ్యలోనే తమ ప్రయత్నానికి గుడ్ బాయ్ చెబుతారు . కొన్నిసార్లు తక్కువ సమయంలో ఒక్కసారిగాడైటింగ్ చేయటం మూలంగా జీవక్రియలు దెబ్బతిని, బరువు తగ్గక పోగా లేనిపోని సమస్యలూ రావచ్చు.ఒకటి రెండు వారాల్లో అధిక బరువు సమస్య దూరం కావాలనుకోకుండా 3 నెలల్లో12 కిలోల వరకు బరువు తగ్గేందుకు ప్రయత్నించటం మంచిది. అదే సమయంలో తగిన ఆహార ప్రణాళికను పాటించటం కూడా అవసరమే. ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆహారంలో జాగ్రత్తలు

  • రోజూ పాలు, పాలఉత్పత్తులు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఆహార పరిమాణం తగ్గినా క్యాల్షియం లోపాలు రావు.
  • అయితే వెన్న తీసినపాలు తాగటం మరువొద్దు.
  • రోజువారీ ఆహారంలో పొట్టుతీయని ధాన్యం, తృణ ధాన్యాలు, మొలకెత్తిన బఠాణీ , సోయా, శెనగలు, అలసందలు, బొబ్బర్లు, పెసల వంటివి ఉండేలా చూసుకోవాలి.
  • గుడ్డు తెల్ల సొనతో వేసిన ఆమ్లెట్, లేత కోడి మాంసం వంటివి కూడా ఉండాలి. దీనివల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి.
  • అల్పాహారానికి మధ్యాన్న భోజనానికీ, సాయంత్రం పూటతప్పనిసరిగా ఒకటి, రెండు రకాల పండ్లు తీసుకోవాలి.
  • ఆహారంలో భాగంగా ముల్లంగి వంటి కూరగాయలు, క్యాబేజీ తదితర ఆకుకూరల వినియోగం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది.
  • ఉదయం, సాయంత్రం ఒక్కో కప్పు గ్రీన్ టీ తాగటం వల్ల అందులోని పాలీ ఫినాల్స్ ట్రై-గ్లిసరైడ్స్'లను విచ్చిన్న పరచి బరువు తగ్గిస్తాయి .
  • దాహంతో నిమిత్తం లేకుండా వీలైనన్ని మంచినీళ్లు తాగటం కూడా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. 

 Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE