మనం ఇష్టంగా తినే కూరగాయల్లో మునగ కాయది ఎంతో ప్రత్యేకమైన స్థానం. అయితే నిజానికి మునగ కాయ కంటే మునగ ఆకులోనే ఎక్కువ పోషకాలుంటాయి. సన్నగా, గుండ్రంగా, మంచి ఆకట్టుకునే రంగుతో, సున్నితంగా ఉండే మునగ ఆకు కేవలం మంచి పోషకాహారమే గాక మంచి సంప్రదాయ ఔషధంగానూ పనిచేస్తుంది. మునగాకులో బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, క్యాల్షియం,విటమిన్స్, ఎమినో యాసిడ్స్, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. మునగాకు ప్రత్యేకత, దాని వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఉపయోగాలు

  • పాలు, పెరుగు, ఏ ఇతర కూరగాయల కంటే మునగాకులోనే క్యాల్షియం అధికంగా ఉంటుంది. తరచూ మునగాకు తినేవారిలో ఎముకలు బలంగా తయారవుతాయి. బలహీనంగా ఉన్న పిల్లలకు చెంచా మునగాకు రసాన్ని పాలతో కలిపి పిల్లలకు ఇస్తే ఎముకలు బలపడటమే గాక రక్తవృద్ధి కలుగుతుంది.
  • మునగాకు, పువ్వుల కషాయం తాగితే గొంతునొప్పితో బాటు చర్మవ్యాధులు కూడా తగ్గుతాయి. మునగాకులో ఉండే 'నియాంజిమినైన్' అనే రసాయనం క్యాన్సర్ రాకుండా చూస్తుంది.
  • విరేచనాలు ఆగకుండా అయ్యేవారికి చెంచా చొప్పున తాజా మునగాకు రసం, తేనె కలిపి ఆ మిశ్రమాన్ని గ్లాసు కొబ్బరినీళ్లలో కలిపి 3 పూటలా ఇస్తే సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది.
  • మునగాకు తినే మధుమేహులలో నెలరోజుల్లో రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.
  • చనుబాలు లేని బాలింతలకు మునగాకు కూర వండి పెడితే పాలు బాగా పడతాయి.
  • ఆస్తమా మొదలు పలు శ్వాస కోశ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు రోజూ గుప్పెడు మునగాకును గ్లాసు నీళ్లలో 5 నిమిషాల పాటు మరిగించి వడకట్టి ఆ కషాయానికి చిటికెడు ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే శ్వాస వ్యవస్థ క్రమముగా బలోపేతం అవుతుంది. 

100 గ్రాముల మునగాకులో ఉండే పోషకాలు

నీరు                           -             75.9% 

కాల్షియం                      -             440 మి.గ్రా.

మాంసకృత్తులు                -              6.7%  

పాస్ఫరస్‌                       -             70 మి.గ్రా.

కొవ్వుపదార్థాలు                -             1.7%     

ఇనుము                          -             7 మి.గ్రా.

పీచుపదార్థం                     -             0.9%  

విటమిన్ సి                      -             220 మి.గ్రా.

ఖనిజలవణాలు                 -              2.3%   

పిండిపదార్థాలు                  -               12.57%

కాలరీలు                          -                 92

 

గమనిక  : వేడి చేసే స్వభావం ఉన్న మునగాకును ఎక్కువ మొత్తంలో తీసుకోవటం మంచిది కాదు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE