ఇప్పుడు తీపి వంటకాలకు చక్కెర వాడుతున్నారు గానీ ఒకప్పుడు అచ్చంగా బెల్లాన్ని వాడేవారు. చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా చాలా మంచిది. చక్కెర తయారీలో వాడే రసాయనాలతో పోల్చితే బెల్లంలో వాటి జాడ బహు స్వల్పం. ఐరన్ తో బాటు ఎన్నో పోషకాలు పుష్కలంగా లభించే బెల్లాన్ని ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడుతారు. రోజువారీ ఆహారంలో బెల్లం వాడకం వల్ల కలిగే ఫలితాలను తెలుసుకుందాం.

 • రోజూ బెల్లం తినే వారిలో రక్తశుధ్ధి జరిగి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. కాలేయంలోని వ్యర్ధాలను తొలగించి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఎంజైముల ఉత్పత్తి, పనితీరును పెంచి జీర్ణసంబంధమైన సమస్యలు రాకుండా చూస్తుంది.
 • బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు రోగనిరోధకశక్తిని పెంచి ఫ్రీ రాడికల్స్, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడతాయి.
 • బెల్లంలో పుష్కలంగా లభించే ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ మహిళల్లో రక్తహీనతను నివారిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం కూడా పెరుగుతుంది. ఇది గర్భిణులకు మరింత మేలు చేస్తుంది.
 • 100 గ్రాముల బెల్లం తింటే 160 మిల్లీగ్రాముల మెగ్నీషియం అందినట్లే. దీనివల్ల మెదడు పనితీరు బాగుండటమే గాక జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
 • బొగ్గు గనులు, నూలు మిల్లులు, సిమెంటు, రసాయన పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు రోజూ 50 గ్రాముల బెల్లం తింటే శ్వాస ద్వారా లోపలికి చేరిన దుమ్ము,వ్యర్ధాలు ఏరోజుకారోజు తొలగిపోతాయి.
 • కీళ్ల నొప్పుల బాధితులు రోజూ 50 గ్రాముల బెల్లం, అంగుళం అల్లం ముక్క కలిపి తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
 • రోజూ గ్లాసు పాలలో నిమ్మకాయంత బెల్లం కలుపుకుని తాగితే ఎముకలు బలోపేతం అవుతాయి.
 • బరువు తగ్గాలనుకునే వారికి బెల్లం మంచి ప్రత్యామ్నాయం.
 • పంచదార మాదిరిగా బెల్లం తిన్నప్పుడు రక్తంలో చక్కర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు గనుకమధుమేహులు పంచదారకు బదులు బెల్లం వాడుకోవచ్చు.
 • వేసవిలో బెల్లం పానకం తాగితే శరీరం చల్లబడి వడదెబ్బ, నీరసం వంటి ఇబ్బందులు తలెత్తవు.
 • నెలసరి సమయంలో ఎదురయ్యే పలు సమస్యల;సమస్యలకు బెల్లం మంచి ఔషధంగా పనిచేస్తుంది.
 • రోజూ బెల్లం తినటం వల్ల తగినంత పొటాషియం, సోడియం అంది రక్తపోటు అదుపులో ఉంటుంది.
 • బెల్లాన్నినువ్వులతో కలిపి తింటే శ్వాసక్రియ పనితీరును మెరుగుపడటమే గాక ఆస్తమా, బ్రాంకైటిస్‌ లాంటి సమస్యలు దూరమవుతాయి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE