వెజిటబుల్ సలాడ్ అనగానే ముందు గుర్తొచ్చేది కీరదోస. ఆరోగ్యం, అందం కోరుకునే వారికి కీరదోస చక్కని, చౌకైన ప్రత్యామ్నాయం. దాదాపు అన్ని కాలాల్లో లభించే కీరదోస ఉపయోగాలు, ప్రత్యేకతలు పూర్తిగా తెలుసుకొంటే ఎవరైనా సరే తప్పక దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటారు.

ప్రత్యేకతలు

 • కీరదోస రక్తంలోని అధికంగా ఉన్న యూరిక్ ఆమ్లం ప్రభావాన్నినివారించి మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించటమే గాక మూత్రపిండాల పనితీరును ఎంతో మెరుగుపరుస్తుంది.
 • మధుమేహులు రోజూ కీరదోస తింటే రక్తంలోఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది.
 • చలికాలంలో తక్కువ నీరు తాగటం సహజం గనుక రోజుకు 2 సార్లు కీరదోస తింటే తగినంత నీరు అందినట్లే.
 • కీరదోసలోని అధికంగా ఉండే పీచు కారణంగా మలబద్దకం, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రావు.
 • కీరదోస క్షారగుణం కడుపులోనిఎసిడిటి, పేగుపూత, అల్సర్ల తీవ్రతను తగ్గించేందుకు బాగా పనిచేస్తుంది.
 • కీరదోసలో ఉండే పొటాషియం, మెగ్నీషియం ధాతువులు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
 • 94% శాతం నీటితో బాటు బోలెడన్ని పోషకాలు ఉండే కీరదోసలో రవ్వంత కొవ్వు ఉండదు గనుక ఊబకాయులు సైతం దీన్ని తీసుకోవచ్చు.
 • అతిగా తినే అలవాటున్నవారు, బరువు తగ్గించుకోవాలనుకొనే వారు గుప్పెడు కీరదోస ముక్కలు తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది గనుక అధికంగా ఆహారం తీసుకునే ప్రమాదం ఉండదు.
 • కీరదోసలోని ఫాలీఫినాల్స్, ఫైటోన్యూట్రీయంట్స్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడి రొమ్ము, ప్రొస్టేట్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు దోహదపడుతుంది.
 • చిగుళ్ళ నుండి రక్తం కారుట, దంత క్షయం వంటి దంత సమస్యలకు కీరదోసలోని పీచుపదార్థంమంచి విరుగుడుగా పనిచేస్తుంది.
 • రక్తంలో యూరిక్ ఆమ్లం ఎక్కువైనప్పుడు వచ్చే కీళ్ల నొప్పికి కీరదోస, క్యారెట్ రెండూ కలిపి చేసిన రసం మంచి విరుగుడు.
 • ఎక్కువ నీరు, విటమిన్ బి, ఎలక్ట్రోలైట్స్ ఉండే కీరదోస తినటం వల్ల తీవ్రమైన తలనొప్పి, హ్యాంగోవర్ తగ్గుతాయి.
 • నిద్రలేమి కారణంగా కంటికింద ఏర్పడిన నల్లని వలయాలు, ఎండ ధాటికి అలసిన కాళ్ళ మీద కీరదోసను చక్రాల్లా కోసి పెడితే మంచి గుణం కనిపిస్తుంది.
 • కీరదోసలో అధికంగా ఉండే ఆస్కార్బిక్ ఆమ్లంకారణంగా సూర్యరశ్మి ధాటికి నల్లబడ్డ చర్మం సహజ రూపాన్ని పొందుతుంది.
 • వేసవిలో కీరదోస తింటే ఎంతటి దప్పికైనా తీరుతుంది. పుచ్చ, కర్బూజాను మించిన నీరు ఇందులో లభిస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE