చికిత్స కంటే నివారణ మంచిదనే నియమం రొమ్ము క్యాన్సర్ కు కూడా వర్తిస్తుంది. రోజూ తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకునే వారిలో రొమ్ము క్యాన్సర్ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. చికిత్స సమయంలో కూడా ఈ తరహా ఆహారం చికిత్స బాగా పనిచేసేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే పోషకాహారం గురించి తెలుసుకుందాం. 

 • క్యాన్సర్ నివారణకు క్యాలిఫ్లవర్, ఇదే జాతికి చెందిన బ్రకోలీ బ్రహ్మాడంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే 'సల్ఫోరాఫేన్' ఆరోగ్యవంతమైన జీవ కణాలకు నష్టం కలిగించకుండానే క్యాన్సర్ కారకాలను గుర్తించి నిర్వీర్యం చేస్తుంది.
 • క్యాన్సర్ నివారణలో టమోటో బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే 'లైకోపిన్పీ'అనే ఫైటో కెమికల్ క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. అందుకే కనీసం ఒకటి రెండు టమోటోలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
 • క్యాప్సికంలోని ఫైటో కెమికల్స్,క్యాప్ససిన్ క్యాన్సర్ కణాల ఎదుగుదలను అడ్డుకుంటాయి. క్యారెట్ కూడా ఇదేవిధంగా పనిచేస్తుంది.
 • బచ్చలి ఆకులో ఉండే విటమిన్ బి, ఫోలేట్ వంటి పోషకాల వల్ల మెనోపాజ్ రాకముందు నుంచేబచ్చలి కూర తినే మహిళలకు రొమ్ము క్యాన్సర్ ముప్పు తక్కువ.
 • శరీరంలో పెరిగే హానికారక కణాలను నశింప చేసే శక్తి నిమ్మరసానికి ఉంది గనుక రోజూ ఓ గ్లాసు నిమ్మరసం తాగటం మంచిది.
 • పసుపులో క్యాన్సర్ తో పోరాడే 'కర్క్యుమిన్' ఉంటుంది. రొమ్ము, ఉదరక్యాన్సర్ లను నివారిస్తుంది.
 • వెల్లుల్లిలోని 'అల్లియమ్'అనే రసాయనం క్యాన్సర్ కణాలను దెబ్బతీస్తుంది.అలాగే క్యాన్సర్ల నివారణకు అల్లం బాగా పని చేస్తుంది. కనుక రోజువారీ వంటకాల్లో కాస్త అల్లం, వెల్లుల్లిచేర్చటం మరువొద్దు.
 • అవకాడోలో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడతాయి. దీన్ని ముక్కలు లేదా జ్యూస్రూపంలో తీసుకోవచ్చు. .
 • రొమ్ము క్యాన్సర్ నివారణకు నల్ల ద్రాక్ష బాగా పనిచేస్తుంది. దీనిలోని ఫైటోన్యూట్రియంట్ రొమ్ము క్యాన్సర్ కణాలను నశింప జేస్తాయి.
 • దానిమ్మలో ఉండే పాలిపెనాల్, ఎలాజిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను ఎదగకుండా చేస్తాయి.
 • గ్రీన్ టీ లోని ఫైటో కెమికల్స్ క్యాన్సర్ కారకాలను నివారిస్తాయి గనుక రోజూ 2 కప్పులు గ్రీన్ టీ తాగితే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గినట్లే.
 • కోడిగుడ్డుతో లభించే 'కోలిన్'అనే పోషకం కారణంగా రోజూ గుడ్డు తినేవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుంది.
 • సాల్మన్ చేపలో లభించేఒమేగా త్రీ ఫ్యాటీఆమ్లాలు, విటమిన్ బి12 రొమ్ము క్యాన్సర్ నివారణకు ఇతోధికంగా దోహదం చేస్తాయి. అలాగే చికిత్స సమయంలో దీన్ని తింటే అందులోని పుష్కలంగా లభించే విటమిన్ డి కారణంగా క్యాన్సర్ కణాలు శక్తిహీనం అవుతాయి.
 • పుట్టగొడుగులలో పుష్కలంగా లభించే ఎర్గోథియోనైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ నివారిణిగా పనిజేస్తుంది గనుక పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవటం మంచిది.
 • అవిసె గింజల్లో అధిక మొత్తంలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు , లిగ్నన్స్, ఫైబర్ రొమ్ము క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించేందుకు ఇతోధికంగా పనిచేస్తాయి. నేరుగా వేయించిన అవిసె గింజలు తీసుకోవచ్చు. లేకుంటే వంటకాల్లో అవిసె పిండి, నూనె కలుపుకున్నా చాలు.
 • గోధుమ జాతికి చెందిన 'రై' అనే ధాన్యంతోచేసిన బ్రెడ్ లో లభించే పీచు, లిగ్నానులు, విటమిన్లు, ఖనిజలవణాలు, ఫైటో న్యూట్రియంట్లు రొమ్ము క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా నివారిస్తాయి.

రొమ్ము క్యాన్సర్ రోగులు తినకూడని ఆహారం

 • నిల్వ పచ్చళ్ళు, పచ్చి కూరగాయలు తినకపోవటమే మంచిది.
 • చక్కెర, మైదా, ఉప్పు అధికంగా వాడి చేసిన వంటకాలు, బీఫ్, మితిమీరిన మసాలా వినియోగం వద్దు.
 • పెరుగుకు కఫం పెంచే గుణం ఉందిగనుక దానికి బదులు మజ్జిగ తీసుకోవాలి.
 • పచ్చి బెండకాయ, దొండకాయ, చామగడ్డ వంటి జిగురు గలిగిన వాటిని తీసుకోవద్దు. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE