రోజూ తినదగిన తీగజాతి కూరగాయల్లో బీరకాయ ఒకటి. అత్యంత సులభంగా జీర్ణమయ్యే బీరకాయలో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు లభిస్తాయి. పీచు అధికంగా ఉండే కూరగాయల్లో బీరకాయ ముఖ్యమైనది.ఈ పీచు కారణంగానే మలబద్ధకం మొదలు మరెన్నో జీర్ణసంబంధిత సమస్యలకు బీరకాయ వినియోగం దోహదం చేస్తుంది. ఆరోగ్యానికి, అందానికి బీరకాయ ఎన్నిరకాలుగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. 

 • మద్యం కారణంగా దెబ్బతిన్న కాలేయ పనితీరును బీరకాయ మెరుగుపరుస్తుంది. మద్యం మానుకున్నవారు లేత బీరకాయ ముక్కలు తినటం వల్ల మళ్ళీ మద్యం తాగాలనే కోరిక తగ్గుతుంది.
 • పసిపిల్లల మొదలు వృద్ధుల వరకు అన్ని వయసుల వారికీ బీరకాయ సులువుగా జీర్ణమవుతుంది. బీరకాయ తినేవారికి మలబద్ధకం, పైల్స్ వచ్చే ఇబ్బంది చాలా తక్కువ.
 • లేత బీరకాయ తినటం వల్ల కామెర్ల బెడద తగ్గుతుంది. రక్తశుద్ధికి కూడా బీరకాయ దోహదం చేస్తుంది.
 • బీరకాయలోని పెప్టైడ్స్ రక్తం, మూత్రంలోని చక్కెర స్థాయిలను తగ్గించటమే గాక బ్లడ్ ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతాయి.
 • బీరకాయలో శాచురేటెడ్ ఫ్యాట్ మూలంగా కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.
 • అధిక నీరు, తక్కువ క్యాలరీలుండే బీరకాయను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గుతారు.
 • అనారోగ్యానికి గురైన వారు రోజూ బీరకాయ రసం, లేత ముక్కలు తింటే జీవక్రియలు వేగం పుంజుకోవటమే గాక రోగనిరోధక శక్తి కూడానా పెరుగుతుంది.
 • లేత బీరకాయను సన్నని చక్రాలుగా కోసి అలసిన కళ్లపై పావుగంట పాటు పెట్టుకుంటే అలసిన కళ్ళకు ఉపశమనం లభిస్తుంది.
 • ఎండపొడ తగిలిన ముఖ చర్మానికి లేత బీరకాయ గుజ్జును పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడుక్కొంటే మొటిమల మచ్చలు, చర్మం మీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి.
 • అధిక చెమట కారణంగా పాదాలు దుర్వాసనగా ఉంటే బీరకాయ ముక్కలతో రుద్ది ఉప్పుతో కడిగితే సరి.
 • బీరకాయలో డైటరీ ఫైబర్ తో పాటు, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ఉగాది పంచాంగ శ్రవణం విశిష్టత

ఉగాది నాడు సాయంత్రం వేళ తప్పక ఆచరించే పండుగ విధుల్లో పంచాంగ శ్రవణం ముఖ్యమైనది. పంచాంగం అంటే ఐదు 

MORE