వంటకాలకు మంచి రుచిని,కమ్మని సువాసనను ఇచ్చే దినుసులు  ఒంటి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. పలు రకాల దినుసుల ఔషధ గుణాల వివరాల గురించి తెలుసుకొందాం.

మెంతులు: పీచు పుష్కలంగా లభించే మెంతుల వినియోగంతో జీవక్రియలు పుంజుకుంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రోజూ మెంతులు తినేవారికి మధుమేహం,  థైరాయిడ్ సంబంధిత ఇబ్బందులు ఉండవు. రక్తశుద్ధితో బాటు చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. మెంతుల వినియోగంతో బిడ్డకు సరిపడా చనుబాలు పడతాయి.

పసుపు: ఇది మంచి యాంటీ బయోటిక్. రోజువారీ వంటకాల్లో పసుపు వాడితే మధుమేహం అదుపులో ఉంటుంది. క్యాన్సర్‌ కారకాలను నిరోధించటమే గాక నొప్పులు, వాపులను తగ్గించే గుణం పసుపుకు ఉంది. పసుపును నీళ్లలో కలుపుకుని తాగితేఎసిడిటీ సమస్య దూరం అవుతుంది. అజీర్తిని తగ్గించటంతో బాటు రక్తశుద్ధికి ఇది దోహదపడుతుంది.

ధనియాలు: విటమిన్ ఎ, విటమిన్ బి2,విటమిన్ డి, ఇనుము పుష్కలంగా లభిస్తాయి. వంటల్లో ధనియాల వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు, గ్యాస్‌ సమస్యలు రావు.రక్తపోటు కూడా పూర్తిగా అదుపులో ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత 2 రోజులపాటు ధనియాలతో కాచిన రసం తాగితే నీరసం తగ్గటమే గాక జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ధనియాల్లో పుష్కలంగా ఉండే పీచు కారణంగా మలబద్దకం దరిజేరదు. చెడుకొలెస్ట్రాల్‌ని తగ్గించేందుకు, థైరాయిడ్‌, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లకు ధనియాల వినియోగం మంచిది.

వాము: శ్వాసకోశవ్యాధుల నివారణ, శ్వాశకోశ పనితీరుకు దోహదపడే అత్యుత్తమమైన దినుసు ఇది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు ఉన్నప్పుడు వేడిచేసిన కొబ్బరినూనెలో వాము కలిపి శరీరానికి బాగా మర్దన చేయటం వల్ల మంచిగుణం కనిపిస్తుంది. వామును పరిమితంగా వాడటం మంచిది.

ఆవాలు: రోజువారీ వంటకాల్లో ఆవాలు వాడితే ఇనుము, జింక్‌, క్యాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా లభించినట్లే. ఆవాల్లోని ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ని నివారించి హృదయారోగ్యాన్ని కాపాడుతాయి. అయితే ఆవాలను మితంగా వాడటం మంచిది.

జీలకర్ర: ఇనుము పుష్కలంగా లభించే జీలకర్ర రోజూ వాడటం వల్ల రోగనిరోధక శక్తి, జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తవిరేచనాలకు జీలకర్ర రసం వాడితే మంచి గుణం కనిపిస్తుంది.

యాలకులు: ఏ వంటకానికైనా కమ్మని సువాసనను తెచ్చే యాలకుల వినియోగంతో మానసిక ఒత్తిళ్లు దూరమవుతాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల ఇన్ఫెక్షన్, దంత సంబంధిత సమస్యల నివారణకు, జీర్ణశక్తి పెరిగేందుకు యాలకుల వినియోగం దోహదపడుతుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక కప్పు ఏలకుల టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఇంగువ: వంటకాల్లో ఇంగువ వాడితే గ్యాస్‌ సమస్యలు, జీర్ణ సమస్యలు రావు. కడుపునొప్పి, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌, నరాల బలహీనత వంటివి సమస్యలు కూడా ఇంగువ వినియోగంతో దూరమవుతాయి.

లవంగాలు: లవంగం నూనెపంటినొప్పికి అత్యుత్తమ ఔషధంగా పనిచేస్తుంది. జలుబు,గొంతు గరగర, పొడిదగ్గు ఉన్నప్పుడు లవంగాలు చప్పరిస్తే మంచిది. ఆస్తమా బాధితులు లవంగాలు వేసి కాచిన నీళ్లు తాగితే శ్వాస సమస్య దూరమవుతుంది. 

దాల్చిన చెక్క: మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు దాల్చిన చెక్క వినియోగం దోహదపడుతుంది. వాంతి అయ్యేలా ఉన్నప్పుడు దాల్చిన చెక్కను చప్పరిస్తే ఇబ్బంది తొలగిపోతుంది. దంత, చిగుళ్ల సమస్య ఉన్నవారు దాల్చిన చెక్క పొడితో నోరు శుభ్రం చేసుకోవటం మంచిది. 

మిరియాలు: పొడిదగ్గు, జలుబుకు మిరియాలు మంచి ఔషధమనే చెప్పాలి. మిరియాలు చలివాతావరణంలో వచ్చే అనారోగ్యాలను దరిజేరనీయకుండా చూస్తాయి. జీర్ణశక్తీ బాగుంటుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE