చలికాలంగా మనసు వేడి వేడి వంటకాల వైపు మొగ్గుచూపుతోంది. అదే సమయంలో ఈ సీజన్లో జీర్ణ శక్తి కూడా రవ్వంత మందగిస్తుంది. అందుకే ఈ రోజుల్లో తరచూ వేడి వేడి సూపులు తీసుకుంటేసూపులు తీసుకోవటం అవసరం. దీనివల్ల జీర్ణాశయం ఉత్తేజితమై ఆకలి పెరగటమే గాక ఉలాసంగా ఉండటం సాధ్యమవుతుంది. ఈ అలవాటును రుచికి బాగుండేకార్న్ సూపుతో ఆరంభిద్దాం.

కావల్సిన పదార్థాలు

  • కప్పు లేత మొక్కజొన్న గింజలు
  • అరకప్పు మొక్కజొన్న పిండి
  • పావు చెంచా మిరియాలపొడి
  • తగినంతఉప్పు
  • అరకప్పు సోయాసాస్‌
  • 2 చెంచాల ఉల్లికాడల తరుగు 

తయారుచేసే పద్దతి

ముందుగా 20 నిమిషాలు నానబెట్టిన లేత మొక్కజొన్న గింజలను 2 నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. మరో గిన్నెలోమొక్కజొన్న పిండి , ఉప్పు, సోయా సాస్‌ తీసుకుని అందులో తగినన్నినీళ్లు పోసి ఉండలు లేకుండా జారుడుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న కార్న్‌లో పోసి చిక్కబడ్డాక మిరియాల పొడి కలిపి దింపేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపొరక ఆకు లేదా కొత్తిమీర చల్లి సర్వ్‌ చేయాలి. ఈ సూప్ కిడ్నీ పనితీరును మెరుగు పరచటమే గాక మూత్ర సంబంధ సమస్యలు రాకుండా నిరోధిస్తుంది.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE