క్రిస్మస్ అంటే.. ముంగిట్లో మెరిసే నక్షత్ర మెరుపులు, అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీ, ఊహించనికానుకలిచ్చే శాంటాక్లాజ్ మాత్రమే కాదు. కమ్మని కేకులు కూడా. క్రిస్మస్ వేళ ఇంట్లో కేక్ తయారు చేయటం సంప్రదాయంగా వస్తోంది. పశ్చిమ దేశాల నుంచి వచ్చిన కేక్ తయారీ వెనుక నోటిని తీపి చేసుకోవటం మినహా ఎలాంటి ప్రత్యేక కారణం లేదు. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మనమూ ప్లమ్ కేక్ చేసి అందరి నోరూ తీపిచేద్దాం. 

కావలనవి

మైదా - పావుకేజీ,

వెన్న - 200 గ్రా,

పంచదార పొడి - పావుకేజీ,

బేకింగ్‌పౌడర్‌ - చెంచా,

గుడ్లు - 6,

వంటసోడా - పావుచెంచా,

శొంఠి, దాల్చినచెక్క, లవంగాల పొడి - అర చెంచా,

చెర్రీ, ప్లమ్‌, ఎండుద్రాక్ష - గుప్పెడు (ముందురాత్రి కోలాలో నానబెట్టాలి)

వెనిల్లా ఎసెన్సు - కొన్ని చుక్కలు,

కారమిల్‌ - 4 చెంచాలు,

పాలు - కొద్దిగా (ఇందులో కారమిల్‌ను కలిపి నానబెట్టాలి) 

తయారీ

ముందుగా మైదాలో బేకింగ్‌పౌడర్‌, వంటసోడా వేసి కలిపి జల్లించి పెట్టుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు పగలకొట్టి.. పచ్చసొనను ఒక గిన్నెలో, తెల్ల సొనను మరో గిన్నెలో వేసి విడివిడిగా గిలకొట్టాలి. ఇప్పుడు ఈ 2 గిన్నెల్లోని గుడ్డు సొనలను ఒకే గిన్నెలో పోసుకొని వెన్న, పంచదారపొడి కలపాలి. తర్వాత అందులో శొంఠి, లవంగాలు, దాల్చినచెక్క పొడిని చేర్చాలి. అనంతరం ముందురాత్రి నానబెట్టిన ఎండుద్రాక్ష, ప్లమ్స్‌, చెర్రీలను వేయాలి. ఇప్పుడు పాలల్లో నానబెట్టిన కారమిల్‌ కలిపి చివరగా మైదాపిండి , వెనిల్లా ఎసెన్సు కూడా వేసి ఐదు నిమిషాల సేపు కలిపి ఉంచాలి. ఈ లోపు ఓవెన్‌ను 180 డిగ్రీలు వేడి చేయాలి. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని వెన్నరాసిన గిన్నెలో పోసి ఓవెన్లో పెట్టి అరగంట ఆగి తీస్తే.. పసందైన ప్లమ్ కేక్రెడీ అయినట్టే.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE