కావలసిన పదార్థాలు

కిలో లేత బెండకాయలు, 2 టమోటాలు, గుప్పెడు ఉల్లిపాయ తరుగు,  చెంచా చొప్పున ధనియాల పొడి, అల్లం , వెల్లుల్లి మిశ్రమం, గసగసాలు, 2 చెంచాల కొబ్బరి తురుము, పావు కప్పు  పెరుగు, చెంచా కొత్తిమీర తరుగు, 1 రెమ్మ కరివేపాకు, 3 చెంచాల నూనె, పావు చెంచా చొప్పున పసుపు, కారం,  గరం మసాలా పొడి, రుచికి తగినంత ఉప్పు

తయారీ

బెండకాయలను కడిగి, తుడిచి అంగుళం సైజులో ముక్కలు చేసుకోవాలి. టమోటోలు 4 ముక్కలు చేసుకోవాలి. బాణీలీ తీసుకొని నూనె వేసి కాగిన తర్వాత ఉల్లి తరుగు వేసి మగ్గేవరకు వేయించాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ , కరివేపాకు, పసుపు వేసి కలిపి 5 నిమిషాలు సన్నని సెగ మీద వేయించి బెండకాయ ముక్కలు వేసి మూతపెట్టకుండా  వేయించాలి. 5 నిమిషాల తర్వాత టమోటా ముక్కలు, కారం, తగినంత ఉప్పు వేసి కలిపి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ లోగా సన్నని సెగ మీద  గసగసాలు వేయించి చల్లారాక కొబ్బరి తురుము కలిపి మిక్సీ పట్టుకొని పెరుగు కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు సగం ఉడకగానే ఈ మిశ్రమాన్ని కలిపి,  ధనియాల పొడి వేసి కలియబెట్టాలి. అవసరాన్ని బట్టి పావు కప్పు నీళ్లు పోసి మూతపెట్టి 5 నిమిషాలు సన్నని సెగమీద ఉడకనిచ్చి చివరగా గరం మసాలా, కొత్తిమీర తరుగు చల్లి దించుకోవాలి. ఘుమఘుమలాడే ఈ కుర్మా అన్నంలోకి , రొట్టెలలోకి మంచి కాంబినేషన్. 



Recent Stories







bpositivetelugu

పిల్లల చదువులో పెద్దల పాత్ర

 గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE