కావలసినవి

మైదా పిండి - 4 కప్పులు

బట్టర్ (వెన్న) - అరకప్పు

చిక్కని పాలు- పావు కప్పు

నారింజ కాయలు- 2 ( ఒలిచి విత్తనాలు తీసి గుజ్జు వేరు చేయాలి)

కోడి గుడ్లు - 6

మెత్తని చక్కెర పొడి - కప్పున్నర

బ్రాందీ - 5 చెంచాలు

కొబ్బరి తరుగు - తగినంత

నెయ్యి- చెంచా

( పదార్థాలన్నీ గది ఉషోగ్రత వద్ద ఉండాలి గనుక తయారీకి గంటకు ముందే ఫ్రిజ్లో ఉండే పాలు, వెన్న, గుడ్లు వంటివి తీసి బయట పెట్టాలి)

తయారీ

  • ముందుగా ఒక గిన్నెలోకి గుడ్ల సొన కార్చి అందులో చక్కెర పొడి కొంచెం కొంచెంగా పోసి కలిపి గిలకొట్టాలి.
  • ఇప్పుడు వెడల్పు గిన్నెలో బట్టర్ తీసుకొని కాస్త వేడి చేసి కరిగిన తర్వాత అందులో ముందు కలిపి పెట్టుకొన్న గుడ్డు, చక్కెర మిశ్రమాన్ని పోసి కలపాలి. చివరగా ఇందులో నారింజ గుజ్జును కలపాలి.
  • 2 నిమిషాలు ఆగి ఈ మిశ్రమంలో కొద్దీ కొద్దిగా పాలు, మైదా పిండి వేసి కలిపి, చివరగా మిగిలిన పదార్థాలను కూడా ఈ మిశ్రమంలో వేసి గంటె జారుడుగా కలియబెట్టాలి.
  • ఇప్పుడు కేక్ పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి అడుగుణ అంటేలా అద్ది దానిలో ముందు కలిపిన మైదా మిశ్రమాన్ని సమంగా పోసుకోవాలి.
  • ఈ పాన్ ను 45 నిమిషాల పాటు 350 డిగ్రీ ఫారిన్ హీట్ వద్ద ఓవెన్ లో ఉంచాలి.
  • చివరగా ఓవెన్ నుంచి పాన్ ను బయటకు తీసి చల్లారిన తర్వాత నచ్చిన క్రీమ్, చెర్రీల వంటి వాటితో నచ్చిన రీతిలో గార్నిష్ చేసుకొంటే కేక్ రెడీ అయినట్లే.

కేలరీ కౌంట్

శక్తి- 211 కేలరీలు

కార్బోహైడ్రేట్స్ - 33 గ్రాములు

ప్రోటీన్లు - 3 గ్రాములు

పీచు- 1 గ్రాము

కొవ్వు- 8 గ్రాములుRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE