కావలసినవి

చిక్కని పాలు - 400 మి.లీ

బేకింగ్ పౌడర్ - 2 చెంచాలు

వెన్న - 120 గ్రాములు

వెనీలా ఎసెన్స్ - 1 చెంచా

మైదాపిండి - 2 కప్పులు

సోడా ఉప్పు - అర చెంచా

నీళ్లు - 1 కప్పు

కోకో పౌడర్ - 50 గ్రాములు

ఉప్పు- రుచికి తగినంత

తయారీ

  • ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, కోకోపౌడర్, సోడా ఉప్పు వేసి కలిపి పక్కన బెట్టుకోవాలి.
  • మరో గిన్నెలో కరిగించిన వెన్న, వెనీలా ఎసెన్స్, పాలు, సరిపడా నీళ్లు పోసి బాగా కలిసేలా గిలకొట్టి దీన్ని ముందు కలిపిన మైదా మిశ్రమంలో పోసి గంటె జారుడుగా కలుపుకోవాలి.
  • అప్పుడు ఓ మోస్తరు కేక్ టిన్ తీసుకొని అడుగున కొద్దిగా పొడి మైదా చల్లి ముందు కలిపిన మిశ్రమాన్ని సమంగా పోసుకోవాలి.
  • ఇప్పుడు కేక్ టిన్ ను 350 డిగ్రీ ఫారిన్ హీట్ వద్ద అరగంట నుంచి 40 నిమిషాలు వేడిచేయాలి.
  • చివరగా ఓవెన్ నుంచి కేక్ ను బయటకు తీసి చల్లారనిచ్చి కేకు మొత్తాన్ని అడ్డంగా కోసి ఆ మధ్యలో చాక్లెట్ క్రీమును పొరగా వేసుకొని మిగిలిన సగాన్ని దానిపై అమర్చుకోవాలి.
  • ఈ కేక్ ను మీ అభిరుచిని బట్టి గార్నిష్ చేసుకుంటే చాక్లెట్ కేక్ తయారైనట్టే. 

కేలరీ కౌంట్

శక్తి - 371 కేలరీలు

కార్బోహైడ్రేట్స్- 53 గ్రాములు

ప్రోటీన్లు - 5 గ్రాములు

పీచు - 1. గ్రాములు

కొవ్వు- 15 గ్రాములు



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE