కావలసినవి

మైదా పిండి- 3 కప్పులు

క్యారెట్ తురుము - 2 కప్పులు

కోడి గుడ్లు - 4

నూనె - కప్పు

చక్కెర పొడి - 2 కప్పులు

బాదం, పిస్తా పలుకులు- కప్పు

దాల్చిన చెక్క పొడి - 2 చెంచాలు

నెయ్యి-చెంచా

చిక్కని పాలు- తగినన్ని 

తయారీ 

  • ముందుగా క్యారెట్ తురుము సిద్ధం చేసుకోవాలి.
  • స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అరకప్పు నూనె పోసి కాగిన తర్వాత అందులో క్యారెట్ తురుము, బాదం, పిస్తా పలుకులు వేసి రంగుమారే వరకు వేయించి తీసి పక్కన బెట్టుకోవాలి.
  • ఒక వెడల్పు గిన్నెలో చక్కెర పొడి, , పాలు, 4 చెంచాల నూనె, గుడ్డు సొన వేసి కలిపి కవ్వంతో చిలకాలి.
  • ఇప్పుడు ఈ సొనలో కొద్దీ కొద్దిగా మైదాపిండి, దాల్చిన చెక్క పొడి వేసి గంటె జారుడుగా కలపాలి.
  • ఒక గిన్నెలో అడుగున నెయ్యి రాసి పై మిశ్రమాన్ని అందులో పోసుకొని దాని ఓవెన్లో 350 డిగ్రీ ఫారిన్ హీట్ వద్ద అరగంటపాటు ఉంచాలి. ఓవెన్ లేనివారు కేక్ టిన్ లో పోసి సన్నని సెగ పెట్టి స్టవ్ మీద ఉంచినా చాలు.
  • తయారైన కేక్ తీసి ఆరిన తర్వాత కోరిన విధంగా గార్నిష్ చేసుకోవాలి. 

కేలరీ కౌంట్

శక్తి - 326 గ్రాములు

పీచు - 1 గ్రాము

ప్రోటీన్లు - 3. గ్రాములు

కార్బోహైడ్రేట్స్ - 42. గ్రాములు

కొవ్వు - 16. గ్రాములు



Recent Stories







bpositivetelugu

పిల్లల చదువులో పెద్దల పాత్ర

 గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE