ఈ చలికాలంలో చేసుకోదగిన సులభమైన గ్రిల్ వంటకాల్లో ఇదొకటి. మంచి రుచితో బాటు బోలెడన్ని పోషకాలనందించే ఈ వంటకాన్నీ సాయంత్రం వేళ పిల్లలకు చిరుతిండిగా ఇస్తే కాదనకుండా తింటారు. మీరూ ఈ రోజే ట్రై చేసి చూడండి. 

కావలసినవి 

పనీర్            -   పావుకిలో (అంగుళం సైజు ముక్కలుగా చేసుకోవాలి)

గడ్డపెరుగు      -  100 గ్రాములు

అల్లం తరుగు   -   చెంచా

వెల్లుల్లి తరుగు  -  చెంచా

గరం మసాలా   -   అర చెంచా

 కారం           -   చెంచా

గ్రీన్ కాప్సికం     -   సగం

రెడ్ కాప్సికం     -    సగం

సోంపు             -    చెంచా

ఉప్పు              -    రుచికి సరిపడా

కొత్తిమీర తరుగు -   2 చెంచాలు

చక్రాలుగా కోసిన ఉల్లి ముక్కలు - 12

తయారీ

  • ముందుగా గ్రిల్ ను వేడి చేయాలి.
  • పై వాటిలో పనీర్, కూరగాయలు, సోంపు తప్ప మిగిలినవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి.
  • ఈ మిశ్రమంలో కోసిన పనీర్ ముక్కలు వేసి ముక్కలకు బాగా పట్టించి అరగంటపాటు ఫ్రిజ్ లో పెట్టాలి.
  • ఇప్పుడు ఫ్రిజ్ లోని పనీర్ ముక్కల్ని తీసి సన్నని పుల్లలకు గుచ్చుతూ వాటి మధ్య కూరగాయ ముక్కలు గుచ్చాలి.
  • వీటిని వేడి గ్రిల్ మీద పెట్టుకొని సోంపు చల్లుకొని, పావుగంటపాటు ముక్కల్ని అన్నివైపులా తిప్పుతుండాలి.
  • పనీర్ ముక్కలు వేడిగా ఉన్న గ్రిల్ కు అంటకుండా మధ్య మధ్యలో కొద్దిగా నూనె చల్లి అన్నివైపులా సమంగా కాలేలా తిప్పుతూ ఉండాలి.
  • పనీర్ ముక్కలు మగ్గిన తర్వాత దించి వాటిపై కొంచెం నిమ్మరసం చల్లుకొని వేడి వేడిగా ఆరగించాలి.Recent Storiesbpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE