చికెన్ అంటే ఇష్టపడనివారు ఉండరు. అందునా ఈ చలిరోజుల్లో గ్రిల్ మీద చేసిన వేడి వేడి చికెన్ కబాబ్స్ అంటే నోట్లో నీళ్లూరాల్సిందే. చికెన్ కబాబ్స్ తయారీ ఎలాగో తెలుసుకొని ఇంట్లోనే ట్రై చేద్దాం. 

కావలసినవి

బోన్ లెస్ చికెన్        -   1 కేజీ

చక్కెర                   -   3 చెంచాలు

పాప్రికా                   -   3 చెంచాలు

బార్బేక్యూ సాస్        -    1 కప్పు

ఉప్పు                    -   రుచికి తగినంత 

తయారీ

  • ముందుగా చికెన్ ను అంగుళం సైజులో క్యూబ్ లుగా కోసుకోవాలి.
  • ఒక గిన్నెలో కోసిన చికెన్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి 1 గంట పాటు ఫ్రిజ్ లో పెట్టాలి.
  • పొయ్యిమీద గ్రిల్ పెట్టి పావుగంట పాటు వేడిచేయాలి.
  • ఈ లోపు మరో గిన్నెలో పాప్రికా, చక్కెర వేసి కలిపి పక్కన బెట్టుకోవాలి.
  • ఫ్రిజ్ లోని చికెన్ తీసి నీళ్లతో కడిగి ఆ ముక్కలకు పాప్రికా, చక్కెర మిశ్రమాన్ని పట్టించాలి.
  • ఇప్పుడు చికెన్ ముక్కలను సన్నని పుల్లలకు గుచ్చుకొని గ్రిల్ మీద పెట్టి 2 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ సన్నని సెగ మీద ఉడికించాలి.
  • చివరగా ముక్కలకు పైపైన బార్బెక్యూ సాస్ రాసి గ్రిల్ మీది నుంచి దించి కొత్తిమీర తరుగు చల్లి, 5 నిమిషాల తర్వాత నిమ్మ చెక్కతో సర్వ్ చేసుకోవాలి.



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE