సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చే వంటకం నేతి అరిసెలు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తినే వంటకమిది. సంక్రాంతి నాటికి కోతలు పూర్తై ఇంటికి చేరిన కొత్త బియ్యం తో అరిసెలు చేయటం తెలుగునాట ఆనవాయితీ. తెలుగునాట అమ్మాయిని కాపురానికి పంపే సమయంలో పంపే సారెలో అరిసెలు పెట్టటం, నడక వస్తున్న చిన్నారులను అరిసెల మీద నడిపించటం తెలిసిందే. గతంలో రోటిలో కొట్టిన పిండితో మాత్రమే అరిసెలు చేసేవారు. అయితే ఇప్పుడు మర పిండితోనూ అరిసెలు చేస్తున్నారు. ఇంత కమ్మని అరిసెలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సినవి

కేజీ బియ్యం, ముప్పావు కేజీ బెల్లం, 100 గ్రాముల నువ్వులు, చెంచా యాలకుల పొడి, కేజీతాజా నెయ్యి.

తయారీ

రాత్రి నానబెట్టిన బియ్యాన్ని ఉదయం కడిగి బుట్ట లేదా చిల్లుల గిన్నెలో పోసి నీళ్లన్నీ పూర్తిగా వార్చుకొని ఆ తడి బియ్యాన్ని రోటిలో దంచి లేదా మర పట్టించి పిండి ఆరిపోక ముందే జల్లెడ పట్టుకోవాలి. మరోవైపు మందపాటి అడుగున్న పాత్రలో బెల్లం ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి ముదురు పాకం పట్టుకోవాలి. పాకం కాగానే అందులో నువ్వులు, యాలకుల పొడి కలిపి ఆ గిన్నె దించి, జల్లెడ పట్టిన పిండిని కాస్త కాస్తగా పాకంలో పోసి తెడ్డుతో బాగా కలపాలి. ఇప్పుడే 100 గ్రాముల నెయ్యిని కూడా పోసి మరోమారు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కాస్త కాస్తగా అరచేతిలోకి తీసుకొని ప్లాస్టిక్ కాగితం మీద పెట్టి మునివేళ్లతో కోరిన సైజులో వత్తుకొని కాగిన నెయ్యిలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి గరిటెలతో నెయ్యి కారేలా వత్తుకొని తీయాలి. ఒక గదిలో బాగా దులిపిన వరిగడ్డిని పరచి దానిమీద ఈ వేడి వేడి అరిశెలను ఆరబెట్టి, చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి. ఇవి నెల రోజులు నిల్వ ఉంటాయి. నెయ్యి దొరక్కపోతే నూనెతోనూ వీటిని చేసుకోవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE