చలి రోజుల్లో సాయంత్రం పూత మనసు కాల్చిన వేడి వేడి మొక్కజొక్క పొత్తుల మీదికి పోవటం సహజమే. చలికాలంలో ఇలా గ్రిల్ మీద కాచిన పదార్థాలు తినటం ఆరోగ్యానికీ మంచిదే. మీ ఇంట్లో గ్రిల్ లేకపోతె ఈ రోజే ఒక గ్రిల్ కొని వేడి వేడిగా మొక్కజొన్న పొత్తులను బట్టర్ తో ఆస్వాదించండి.

కావలసినవి

చెంచా బట్టర్

అరచెంచా హెర్బల్ పౌడర్

3 లేత మొక్కజొన్న పొత్తులు

అరచెంచా మిరియాల పొడి

గరిటెడు నూనె

రుచికి సరిపడా ఉప్పు

చేసే పద్దతి

గ్రిల్ మీద మొక్కజొన్న పొత్తులను సన్నని సెగమీద దోరగా కాల్చాలి. గింజలు ఎక్కువగా మాడిపోకుండా మధ్యమధ్యలో వీటిని తిప్పుతూ ఉండాలి. ఈ లోపు ఒక గిన్నెలో బట్టర్, మిరియాలపొడి, హెర్బల్ పౌడర్ వేసి కలిపి పెట్టుకోవాలి. పొత్తులు ఓ మాదిరిగా కాలిన తర్వాత కలిపి పెట్టుకొన్న మిశ్రమాన్ని బ్రష్ తో కొద్దీ కొద్దిగా వేడి వేడి పొత్తులకు రాసుకొని మరోమారు గ్రిల్ మీద పెట్టి తిప్పుతూ గింజలు సరిపడా కాలిన వెంటనే తీసి ఉప్పు, నిమ్మరసం చల్లుకొని వేడి వేడిగా తినాలి .



Recent Stories







bpositivetelugu

పిల్లల చదువులో పెద్దల పాత్ర

 గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE