సంక్రాంతి నాడు బెల్లం పొంగలిని దేవునికి నివేదించటం ఆనవాయితీ. చలి కాలంలో వచ్చే పలు శారీరక రుగ్మతలకు బెల్లం మంచి ఔషధం. పండుగ పేరుతోనైనా బెల్లంతో చేసిన పొంగలి తింటారనే మంచి ఉద్దేశంతోనే మన పూర్వీకులు ఈ పద్దతిని ప్రవేశ పెట్టారు.  ఇప్పుడు బెల్లం పొంగలి ఎలా చేస్తారో తెలుసుకుందాం.   

కావలసినవి

బియ్యం                     -      2 కప్పులు

బెల్లం                         -     పావు  కిలో

పచ్చి సెనగ పప్పు     -      350 గ్రాములు 

పాలు                          -      లీటరు

జీడిపప్పు,కిస్ మిస్    -      గుప్పెడు

తాజా నెయ్యి              -       అరకప్పు

యాలకులు               -        4 

తయారీ 

  • ముందుగా బియ్యం,పచ్చిశెనగపప్పు విడివిడిగా కడిగి పెట్టుకోవాలి.
  • 2 చెంచాల నెయ్యిలో జీడిపప్పు, కిస్ మిస్ వేయించుకొని పక్కన బెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక పాత్రలో పాలను మరిగించి అందులో కడిగిపెట్టిన బియ్యం వేసి ఉడుకు పట్టగానే పచ్చిశెనగ పప్పు కూడా వేసుకోవాలి.
  • 5 నిమిషాల తరవాత దంచిన బెల్లం వేసి కలియబెట్టాలి. బెల్లం పూర్తిగా అన్నానికి పట్టగానే అందులో నెయ్యి వేసి కలుపుకోవాలి.
  • ఇందులో దంచిన యాలకుల పొడి కలిపి పూర్తిగా ఉడికిన తర్వాత దించుకొని నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్ మిస్ కలుపుకోవాలి.



Recent Stories







bpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE