భోగినాడు కొత్త బియ్యతో చేసిన పులగం తినటం సంప్రదాయం. కొత్త బియ్యం, పెసర పప్పు, నెయ్యి, మిరియాలు జోడించి చేసే ఈ వంటకం రుచికే గాక పోషకాల పరంగానూ ఎంతో మేలైనది. ఇప్పుడు ఆ పులగం తయారీ ఎలాగో తెలుసుకుందాం. 

కావలసినవి

పెసర పప్పు           -           1 గ్లాసు

బియ్యం               -           3 గ్లాసులు

నెయ్యి                 -          అరగ్లాసు

మిరియాలు           -         అరచెంచా   

అల్లం ముక్కలు       -         పావు చెంచా

ఇంగువ               -          చిటికెడు

ఉప్పు                  -          రుచికి తగినంత 

తయారీ

ముందుగా పైన చెప్పిన కొలత ప్రకారం వేరు వేరు గిన్నెల్లో పెసర పప్పు, బియ్యం తీసుకొని కడిగి మునిగే వరకు నీళ్ళో పోసి కనీసం 2 గంటలపాటు నానబెట్టుకోవాలి. బియ్యం ఎంత బాగా నానితే పులగం అంత మృదువుగా వస్తుంది. అవి బాగా నానిన తర్వాత ఒక పాత్ర తీసుకొని అందులో నెయ్యి వేసి కాగనిచ్చి ఆందులో ముందుగా జీలకర్ర, తర్వాత దంచిన మిరియాలు, చివరగా చిటికెడు ఇంగువ వేయాలి. ఇందులో ఏ ఇతర తాలింపు గింజలూ వేయొద్దు. ఇప్పుడు 9 గ్లాసుల నీళ్లు(గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల నీళ్ల చొప్పున) ఎసరుగా పోయాలి. రు చికి కావాలంటే చిన్న గ్లాసుడు పాలు కూడా పోసుకోవచ్చు. ఎసరు బాగా తెర్లిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఉడకనివ్వాలి. బియ్యం ఉడుకు పట్టిందనగానే పెసరపప్పు వేసి బాగా కలతిప్పి ఉడికించాలి. రెండూ బాగా దగ్గరకయ్యాక  తగినంత ఉప్పు, కాసిన్ని అల్లం ముక్కలు (సన్నగా తరిగినవి) కలుపుకోవాలి.మరీ గట్టిపడక ముందే దించి మరికాస్త నెయ్యి వేసి కలిపి నేతిలో వేయించిన జీడిపప్పు చల్లుకొంటే ఘుమఘుమలాడే పులగం తయారైనట్టే. ఏదైనా రోటి పచ్చడితో నంజుకొని తింటే దీని రుచి మరింత బాగుంటుంది.Recent Storiesbpositivetelugu

పిల్లల చదువులో పెద్దల పాత్ర

 గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE