వంటగదిలో ఎప్పుడూ నిల్వ ఉంచుకొనే దుంప గూరల్లో బంగాళ దుంప ముఖ్యమైనది. ఆలూతో ఎప్పుడూ చేసే రొటీన్ గా చేసే వంటకాల స్థానంలో కాస్త వెరైటీ గా ఉండే ఆలూ, పెప్పర్ కర్రీ చేసి చూద్దాం. 

కావలసినవి

బంగాళా దుంపలు – పావుకిలో, ఉల్లిపాయ తరుగు – గుప్పెడు, పచ్చిమిర్చి- 3, పసుపు - పావు చెంచా, అల్లం వెల్లుల్లి మిశ్రమం- అర చెంచా, కరివేపాకు- 1 రెబ్బ, మిరియాల పొడి - అర చెంచా, ఉప్పు - రుచికి తగినంత, తాలింపు గింజలు- అరచెంచా, కొత్తిమీర తరుగు- చెంచా, నూనె- తాలింపుకోసం 

చేసే పద్దతి

 చెక్కు తీసిన బంగాళా దుంపలను పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి తాలింపు గింజలు, కరివేపాకు వేసి తర్వాత ఉల్లి తరుగు వేసి మగ్గే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో పసుపు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మరో 5 నిమిషాలు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసి కలిపి అందులో బంగాళా దుంప ముక్కలు, తగినంత ఉప్పువేసి బాగా కలిపి మూత పెట్టాలి. ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత కప్పుడు నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. ముక్క ఉడికిన తర్వాత గరిటతో కాస్త మెదిపి దానిపై మిరియాల పొడి చల్లి కలిపి 3 నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు చల్లి దింపేయాలి. ఈ కూరను పుల్కా, పూరీ, చపాతీ, దోశలతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. 



Recent Stories







bpositivetelugu

చిన్నారుల్లో మానసిక ఒత్తిళ్లు

విషాదాలు మనుషులను చెప్పలేంతగా కుంగదీస్తాయి. వీటి ప్రభావాల నుంచి బయటపడేందుకు ఒక్కోసారి ఏళ్ళ సమయమూ

MORE
bpositivetelugu

జంటనగరాల బోనాల వేడుకలు

ఆషాఢమాసపు బోనాల ఆధ్యాత్మిక శోభతో యావత్ తెలంగాణా వెలుగుతోంది. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ,

MORE