చలికాలంలో లభించే కూరగాయల్లో క్యారెట్ ఒకటి. దీని రుచి, ఆకట్టుకొనే రంగు వంటి లక్షణాల వల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా సలాడ్, వేపుడు,  కూర, హల్వా గా దీన్ని ఆస్వాదించటం తెలిసిందే. అయితే పండుగల సమయంలో మనం చేసుకొనే పూర్ణాలను క్యారెట్ తోనూ చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పూర్ణాల తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

కావలసినవి

క్యారట్ తురుము - 1 కప్పు, మినప్పప్పు-  1 కప్పు, చక్కెర – ½ కప్పు, పాలు- 1/2 కప్పు, యాలకుల పొడి - అర చెంచా, నెయ్యి - 4 చెంచాలు, కాజు,బాదం,కిస్మిస్ పలుకులు- 2 చెంచాలు,  ఉప్పు - పావు చెంచా, నూనె - వేయించడానికి 

చేసే విధానం   

మినప్పప్పు 3 గంటలు నాననిచ్చి రుబ్బుకుని 2 గంటలు ఉంచాలి. తర్వాత  బియ్యంపిండిలో నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. పై రెండిటినీ కలిపి తగినంత ఉప్పు వేసి గంటపాటు పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో  చెంచా నెయ్యి వేడి చేసి కాజు,బాదం,కిస్మిస్ వేయించి తీసుకోవాలి. తర్వాత ఇదే పాన్ లో మరో 2 చెంచాల నెయ్యి వేసి కారట్ తురుము వేసి దోరగా వేయించాలి. తర్వాత ఇందులో పాలు పోసి కలిపి ఇగిరిన తరువాత పంచదార వేసి కలపాలి. చక్కెర  కరిగి మిశ్రమంలో క్యారెట్ ఉడికిన తర్వాత యాలకుల పొడి కలిపి దించుకోవాలి. ఇది చల్లారిన తరువాత డ్రై ఫ్రూట్స్ కలిపి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలను రెడీగా ఉన్న పిండిలో ముంచి కాగిన నూనెలో వేయించి తీసుకుంటే కమ్మని క్యారెట్ పూర్ణాలు సిద్దమైనట్లే. వేడి వేడి పూర్ణాలను బడి నుంచి ఇంటికి రాగానే పిల్లలకు  ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE