దక్కన్ ప్రాంతపు విందుల్లో మిఠాయి విభాగంలో డబల్ కా మీఠా తప్పనిసరి. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో పధ్ధతిలో చేస్తారు. నెయ్యి కాస్త ఎక్కువే వాడినా అరుదుగానే తింటాము గనుక అందరూ నిరభ్యంతరంగా తినొచ్చు. ఇప్పుడు దాని తయారీ ఎలాగో తెలుసుకుందాం.

కావలసినవి

బ్రెడ్                    -   4 స్లైసెస్

చక్కెర                 -   కప్పు

కాచిన పాలు        -    2 కప్పులు

తాజా నెయ్యి        -   పావుకప్పు

యాలకుల పొడి   -     అర చెంచా    

తయారీ

ముందుగా బ్రెడ్ స్లైసెస్ ను ఎండలో గానీ ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టాలి. ఎండగానే తీసి నేతిలో ముదురు రంగు వచ్చే వరకు వేయించుకొని కాచ్ ఆరబెట్టినా పాలలో వేసి నాననివ్వాలి. ఇప్పుడు పంచదారలో కొంచెం నీళ్ళు పోసి పాకం వచ్చాక అందులో యాలకుల పొడి వేసి కలిపి  పాలల్లో నానిన బ్రెడ్ స్లైసెస్ ను వేయాలి. మిశ్రమం ఉడికేటప్పుడు ఎక్కువగా కలిపితే హల్వాలాగా అయిపోతుంది గనుక కలపొద్దు. పాకం బ్రెడ్ ముక్కలకు పట్టి వాటిలోని నెయ్యి బయటికి వస్తుండగా స్టవ్ ఆఫ్ చెయ్యాలి. చివరగా నేతిలో వేయించిన కాజూ,కిస్మిస్ లతో గార్నిష్ చేసుకోవాలి.



Recent Stories







bpositivetelugu

పిల్లల చదువులో పెద్దల పాత్ర

 గతంలో కంటే ఇప్పటి మన విద్యావిధానం పూర్తిగా భిన్నమైనది. అప్పుడు ఉపాధ్యాయుల నిర్ణయం మేరకు పిల్లల చదువు సాగేది. 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE