ఇటీవలికాలంలో ఉద్యోగుల వంటి శారీరక శ్రమ తక్కువ ఉన్నవారు రాత్రి వేళ అన్నానికి బదులు పరిమితంగా చపాతీ తినటం చూస్తున్నాం. దీనివల్ల పలు జీవన శైలి రోగాలు అదుపులో ఉండటమే గాక జీర్ణవ్యవస్థ మీద ఒత్తిడి తగ్గుతుంది. అటు పోషకాల పరంగానూ చపాతీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాత్రి భోజనములో చపాతీ తినటం వల్ల కలిగే లాభాలు... 

  • గోధుమపిండిలో తక్కువ కొవ్వు ఉంటుంది గనుక కొలెస్ట్రాల్ బెడద ఉండదు.
  • కాపర్, అయోడిన్, మాంగనీస్, సల్ఫర్, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం, వంటి ఖనిజాల లవణాలు  తగినంత లభిస్తాయి.
  • చపాతీ తినటం వల్ల తగినంత లభించే పీచు,జింక్ చర్మాన్ని కాంతివంతం చేయటంతో బాటు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి.
  • గోధుమల్లో ఉండే ఐరన్ నిల్వలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి.
  • మధుమేహుల రక్తంలోని గ్లూకోజ్ నిల్వలు ఒక్కసారిగా పెరగకుండా ఉండేందుకు చపాతీల వినియోగం దోహదపడుతుంది.
  • ఊబకాయం, అధికబరువు సమస్యల నివారణ, అదుపు సాధ్యమవుతుంది.

గుర్తుంచుకోవాల్సినవి

  • బయట లభించే పిండికి బదులు మేలైన గోధుమలను ఎంపిక చేసుకొని పిండి పట్టించుకోవటం మంచిది.
  • మొదట 3 చపాతీలతో మొదలు పెట్టి దాన్ని 2కు తగ్గించుకోవాలి.
  • తక్కువ నూనె లేదా అసలు నూనె వాడకుండా చపాతీ కాల్చుకొని ఆకుకూర, పప్పుతో తినటం మంచిది. 



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE