పచ్చి మామిడి రుచులలో ఆహా అనిపించే వాటిలో మెంతి మామిడి పచ్చడి ఒకటి. పులుపు, కొద్దిపాటి తీపి,కాస్త ఘాటు రుచుల కలగలుపుగా ఉండే ఈ పచ్చడిని ఇష్టపడని వారుండరు.  ఈ ఏడాది ఇప్పటికే పచ్చి మామిడి కాయలొచ్చాయి గనుక ఈ రోజే  దీన్ని ట్రై చేద్దాం. 

కావలసినవి

చిన్నగట్టి మామిడికాయలు- 5, మెంతులు- అరకప్పు, ఆవాలు- చెంచా, ఎండు మిర్చి- 5, బెల్లం తురుము- పావుకప్పు, ఇంగువ- చిటికెడు, పసుపు- పావుచెంచా, నూనె- పావుకప్పు, ఉప్పు - రుచికి తగినంత 

తయారీ

ముందుగా మామిడికాయల చెక్కు తీసి కడిగి తుడిచి చిన్న ముక్కలుగా కోసి 5 నిమిషాలు ఆరనివ్వాలి. ఇప్పుడు మూకుడు వేడిచేసి మెంతులు, ఎండుమిర్చి వేయాలి. మెంతులు ఎర్రగా వేగాక  ఆవాలు వేసి చిటపటలాడాకా దించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి.  ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో ఆరిన మామిడి ముక్కలు తీసుకొని దానికి మిక్సీ పట్టిన మెంతి, ఆవపొడి కలిపి పట్టించాలి. చివరగా ఉప్పు , పసుపు , బెల్లం తురుము , ఇంగువ , నూనె వేసి మరోమారు బాగా కలిపి మూత పెట్టి 4 గంటల తర్వాత తినొచ్చు. దీన్ని వేడి వేడి అన్నంలో లేదా చపాతీ, రొట్టెతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. తడి తగలకుండా ఉంటే వారంపాటు నిల్వ ఉంటుంది కూడా. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE