ఈ తరానికి చిరుతిండి అంటే జంక్ ఫుడ్ అని మాత్రమే తెలుసు. రుచికి బాగానే ఉన్నా దీనివల్ల ఊబకాయం మొదలు హృద్రోగ సమస్యల వరకు పలు అనారోగ్యాలబెడద ఎక్కువవుతున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడవుతోంది. అలాగని జుంక్ ఫుడ్ అసలే మానుకోవలసిన అవసరం లేదుగానీ దాన్ని పరిమితం చేస్తే చాలు. జంక్ ఫుడ్ విషయంలో పిల్లలు, యువతతో బాటు అందరూ పాటించదగిన కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

చిట్కాలు

  • ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తిని మిగిలిన సమయాల్లో మానుకోవాలి.
  • ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకునేందుకు బదులుగా కొద్ది మొత్తాలను దఫదఫాలుగా తీసుకోవాలి.
  • పిజ్జా, బర్గర్లకు బదులుగా చిరు ధాన్యాలతో ఇంట్లో చేసుకునే పదార్ధాలను తినాలి.
  • డబ్బాలలో నిల్వ ఉంచిన ఆహారానికి బదులుగా అప్పటికప్పుడు చేసుకున్న తాజా ఆహారాన్నే తినాలి.
  • మార్కెట్లో రెడీ మేడ్ ఫుడ్ కొనే ముందు దానిలోని పోషకాల వివరాలను గమనించాలి.
  • కృత్రిమ రంగులు వాడిన ఆహారానికి దూరంగా ఉండాలి.

జీవన శైలి మార్పులు

  • వంటరాని వారు కనీసం ఆమ్లెట్ వంటి అయిదారు రకాల ఆహారం తయారీ నేర్చుకుంటే బయటి ఆహారం మీద ఆధారపడటం తగ్గుతుంది.
  • తరచూ వేపుడు కూరలు తినేవారు ఆవిరిమీద ఉడికించిన వంటలు, సలాడ్స్ తీసుకోవాలి.
  • ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసే అలవాటుకు స్వస్తి చెప్పి అప్పుడప్పుడూ పండ్లు, బ్రెడ్ తో సరిపెట్టుకోవాలి.
  • ఆఫీసుకు బయలుదేరేముందే ఏమేమి టిఫిన్ బాక్స్ లో పెట్టుకోవాలో నిర్ణయించుకోవాలి.
  • అన్నిటికన్నా ముఖ్యంగా జంక్ ఫుడ్ మానుకూవటం కష్టమనే ఆలోచనను మనసులో నుంచి తీసేయాలి.



Recent Stories







bpositivetelugu

పరిమళాల వాడకంలో మెళకువలు

మనసుకు, శరీరానికి హాయినిచ్చే పరిమళాలను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు, యువత ఈ విషయంలో ముందుంటారు.

MORE
bpositivetelugu

రంజాన్ దాన, ఉపవాసాల విశేషాలు

ఏ పండుగైనా శాంతిని, మానవాళి హితాన్నే ప్రబోధిస్తుంది. రంజాన్ (రమదాన్) పండుగా ఇదేవిషయాన్ని చెబుతోంది. ఇస్లామీయ కేలండర్లో

MORE