జీడిపప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసు. వంటకాల్లో గుప్పెడు జీడిపప్పు పడితే ఆ రుచే వేరు. జీడిపప్పును మిఠాయిల్లో గార్నిషింగ్ కోసం వాడటం తెలిసిందే. అయితే జీడిపప్పుతోనే చేసే మిఠాయిలూ ఉన్నాయి. వాటిలో సులభంగా చేసుకోదగిన వాటిలో కాజూ బర్ఫీ ఒకటి. అదెలా చేయాలో చూద్దాం.

కావలసినవి

జీడిపప్పు - 2 కప్పులు, చక్కెర- కప్పు, యాలకులపొడి- అర చెంచా, నెయ్యి- కప్పు, సిల్వర్ పేపర్ - 1(ఏ 4 సైజు)

తయారీ

జీడిపప్పును 3 గంటలపాటు నానబెట్టి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. నాన్ స్టిక్ పాన్ లో చక్కెర, కప్పు నీళ్లుపోసి సన్నని మంటపై పాకం పట్టుకోవాలి. తీగపాకం రాగానే అందులో మిక్సీ పట్టిన జీడిపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. మిశ్రమం గట్టిపడే సమయంలో నెయ్యి, యాలకుల పొడి వేసి మరోమారు కలుపుకోవాలి. ఒక వెడల్పాటి పళ్లెంలో 2 చెంచాల నెయ్యి వేసి అంతా  అంటేలా రాసి ఈ మిశ్రమాన్ని సమంగా పోసుకోవాలి. ఈ మిశ్రమం మీద పల్చని సిల్వర్ ఫాయిల్ పరుచుకొని ఆరిన తరవాత డైమండ్ ఆకారంలో కోసుకుంటే నోరూరించే కాజూ బర్ఫీ రెడీ. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE