రోజూ మనం తాగే టీ, కాఫీల్లో, కేక్, చాకోబార్ లలో  ఉండే ఒక రసాయనమే కెఫీన్. సాంకేతికంగా చూస్తే ఇదీ మానసికోల్లాసాన్ని కలిగించే మత్తు పదార్థమే అయినా ప్రాణాంతకం కాదు గనుక దీనికి ప్రపంచవ్యాప్త చట్టబద్దత ఏర్పడింది. ఇతర పదార్థాలు తీసుకొనే వారికంటే రోజూ పలుమార్లు టీ, కాఫీ తాగేవారిలో దీనిప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. రోజూ కాఫీ తాగే వేళకి వీరు పనిలో ఎంత బిజీగా ఉన్నా ఆ పనిని పక్కబెట్టి కాఫీకోసం ఆరాటపడుతుంటారు. ఇలా కెఫీన్ వినియోగం ఎక్కువయ్యే కొద్దీ ఇదో వ్యసనంగా మారి నాడీ, జీర్ణవ్యవస్థల మీద తప్పక ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎంతవరకు ఓకే?

కెఫీన్ ప్రభావాలను పక్కనబెడితే దీనికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. పలు రూపాల్లో కెఫీన్ తీసుకొంటున్నా వారిలో మెజారిటీ కాఫీ ప్రియులే. నిపుణుల లెక్కల ప్రకారం రోజూ 130 నుంచి 200 మిల్లీగ్రాముల కెఫీన్ పొందేవారికి ఏ ఇబ్బందీ లేదు. రోజుకు 200 నుంచి 300 మిల్లీ గ్రాముల కెఫీన్ వాడేవారికి దీర్ఘకాలంలో కొన్ని సమస్యలు రావచ్చు. అదే రోజుకు 600 మిల్లీగ్రాముల కెఫీన్ తీసుకొంటున్నవారు ప్రమాద జోన్లో ఉన్నట్లే. అంతకు మించి వాడిన వారికి ఇప్పటికీ పలు సమస్యలు మొదలై ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

మీపై కెఫీన్ ప్రభావం ఎంత?

 మీరు కాఫీ ప్రియులై ఉంటే మీ మీద కెఫీన్ ప్రభావం ఏమేరకు ఉన్నదో దిగువ ప్రశ్నలు వేసుకోవటం ద్వారా తెలుసుకోవచ్చు. అవి ..

 • కాఫీ తాగకపోతే ఆ రోజంతా చిరాగ్గా ఉంటుందా?
 • కాఫీ మానుకుందామని ప్రయత్నించినా వీలుకావటం లేదా?
 • రోజుకు 4 కప్పులకు మించి కాఫీ తాగుతారా?
 • పడుకోబోయే ముందు కాఫీ తాగినా హాయిగా నిద్ర పడుతోందా?
 • ఓ కప్పు కాఫీ తాగితే చక్కని ఆలోచనలు వస్తాయని, ఎక్కువ సేపు పని చేయగలరని నమ్ముతున్నారా ?

పై ప్రశ్నల్లో ఏ రెండిటికైనా మీరు అవునని జవాబిస్తే మీరు తప్పక కెఫీన్ ప్రభావానికి లోనయినట్లే.

కెఫీన్ ఎక్కువైతే వచ్చే సమస్యలు

 • ఒంట్లో చేరిన కెఫీన్ ను పూర్తిగా తొలగించేందుకు కాలేయానికి కనీసం 4 నుంచి 5 గంటలు పడుతుంది. తీసుకొనే కెఫీన్ పరిమాణం పెరిగేకొద్దీ కాలేయంపై ఒత్తిడి పెరుగుతుంది.
 • కెఫీన్ రక్తపోటును పెంచి హృదయ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఊబకాయులు, వృద్ధుల్లో ఈ ముప్పు ఎక్కువ.
 • రోజుకు 744 మిల్లీగ్రాములకు మించి కెఫీన్ తీసుకొనే నడివయసు మహిళల్లో కాల్షియం మూత్రంలో ఎముకలు గుల్లబారి పోతాయి.
 • పిల్లలు ఇష్టపడే చాకోబార్, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, కేక్స్ వంటి వాటిలో సైతం ఎక్కువ మోతాదులో కెఫీన్ ఉంటుంది. వీటి వినియోగం పెరిగే కొద్దీ పిల్లల్లో మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువవుతాయి.
 • పరీక్షల వేళ రాత్రిపూట టీ, కాఫీ తాగి మేలుకొని చదువుకోవటం వల్ల పలు అనారోగ్య సమస్యలు రావచ్చు.
 • కొందరికి నిద్రకు ముందు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మానుకోకపోతే నిద్రలేమి, జీర్ణ సమస్యలు తప్పవు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE