ఎప్పుడూ చేసుకొనే రైస్ వంటకాలకు భిన్నంగా ఏదైనా ట్రై చేద్దామనుకొనే వారికి టోఫూ, కార్న్ ఫ్రైడ్ రైస్ ఒక మంచి ప్రత్యామ్నాయం. కమ్మని రుచి, మంచి పోషకాలున్న ఈ కొత్త వంటకం ఎలా చేయాలో తెలుసుకుందాం. 

కావలసినవి

సన్న లేదా బాసుమతి బియ్యం- 2 కప్పులు, స్వీట్ కార్న్ - అరకప్పు, టోఫూ ముక్కలు - అరకప్పు, ఉల్లితరుగు - గుప్పెడు పచ్చిమిర్చి -3, కరివేపాకు - 2 రెబ్బలు, పసుపు - పావుచెంచా, క్యారట్ తరుగు - 3 చెంచాలు, కొత్తిమీర తరుగు - 3 చెంచాలు, అల్లం వెల్లుల్లి మిశ్రమం- చెంచా, గరం మసాలాపొడి - పావు చెంచా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 6 చెంచాలు, నెయ్యి - 2 చెంచాలు 

తయారీ

ముందుగా బియ్యం కడిగి 30 నిమిషాలు నాననిచ్చి తక్కువ ఎసరుపోసి పలుకుగా వండుకోవాలి. ఈ లోపు స్వీట్ కార్న్ గింజలను ఆవిరిమీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టోఫూ ను అంగుళం ముక్కలుగా కోసుకొని నూనెలో రంగుమారేవరకు వేయించి గోరువెచ్చని నీళ్లలో వేసి ఉంచాలి. దీనివల్ల ఈ ముక్కలు గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి. తర్వాత ప్యాన్‌లో 3 చెంచాల నూనె వేడిచేసి ఉల్లితరుగు, నిలువుగా చీరిన పచ్చిమిర్చి వేసి మగ్గనిచ్చి పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి . ఇప్పుడు ఈ మిశ్రమంలో టోఫూ ముక్కలు, ఉడికిన కార్న్, క్యారెట్ తురుము వేసి 5 నిమిషాలు మూత పెట్టి వేయించాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా అన్నం వేసి కలిపి గరం మసాలా పొడి,ఉప్పు చల్లి కలిపి 3 నిమిషాలు మగ్గనిచ్చి చివరగా కొత్తిమీర తరుగు చల్లి కలిపి దించుకొని వేడివేడిగా వడ్డించుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE