ఆరోగ్యం విషయంలో పోషకాహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో..చక్కని వ్యాయామము సైతం అంతే అవసరం. ఈ అంశాన్ని విస్మరించటం వల్లే ఇప్పుడు చాలామంది అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా పోషకాహార నిపుణులు సూచిస్తున్న10 నియమాల గురించి తెలుసుకొందాం.

  • రోజూ గ్లాసు పచ్చికూరగాయల రసాన్ని తీసుకోవటం, ఒక ప్లేటు తాజా, పచ్చి కూరగాయ ముక్కలు తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి తగినన్ని యాంటీఆక్సిడెంట్లు లభించటమే గాక ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
  • రోజువారీ ఆహారంలో తగు పరిమాణంలో మాంసకృత్తులు ఉండాలి. జీవకణాల మరమ్మతులు, కండరాల ఎదుగుదలకు దోహదపడే మాంసకృత్తులు ఎక్కువగా లభించే పప్పులు, నెయ్యి, పాలు తదితరాలు రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
  • రోగనిరోధక శక్తి నిచ్చే బీటాకెరటిన్‌, విటమిన్‌-సి కోసం ఏవైనా 2 రకాల పుల్లని పండ్లు తినాలి. అలాగే శక్తికోసం గింజల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
  • రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్, ఆకుకూర, విటమిన్ - ఈ లభించే పదార్థాలు తీసుకోవాలి. దీనివల్ల వయసు పైబడినా వృద్ధాప్య ఛాయలు రావు.
  • వారంలో ఒకరోజు కేవలం పండ్ల సలాడ్ తినటం ద్వారా ఊబకాయం, అధిక బరువు సమస్య రాకుండా చూసుకోవచ్చు.
  • ఒక వ్యక్తి నెలకు అరలీటరుకు మించి వంట నూనె వాడకుండా చూసుకోవటం, కొవ్వు ఎక్కువగా ఉండే నూనెల స్థానంలో ఆలివ్‌, తవుడు నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవ నూనెలు వాడటం అలవరచుకోవాలి. చక్కెరతో చేసిన మిఠాయిలు, ప్రాసెస్డ్‌ ఆహారం, వేపుళ్లు, ఫాస్ట్ ఫుడ్ తగ్గించుకోవాలి.
  • వీలున్నంత మేరకు మానసిక ఒత్తిడిని నియంత్రించాలి. ఇందుకోసం సంగీత సాధన, యోగ, ప్రాణాయామ సాధనాలు చేయాలి.
  • కుటుంబ, సామాజిక సంబంధాలను బలోపేతం చేసుకోవటంతో బాటు పెంపుడు జంతువుల ఆలనా పాలనా చూడటం ,మొక్కల పెంపకం , వంటి వ్యాపకాలు ఆరోగ్య హేతువులని గుర్తించుకోవాలి.
  • వారంలో కనీసం 5 రోజులు.. రోజుకు 50 నిమిషాలు ఒంటికి చెమట పట్టేలా వ్యాయామం చేయాలి. దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగి జీవక్రియలు వేగం పుంజుకొంటాయి. చక్కని శరీర సౌష్టవం కూడా వస్తుంది.
  • ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE