ప్రేమికుల రోజున ప్రేయసీప్రియులు బహుమతులతో చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడం సంప్రదాయం. అయితే ఎప్పటిలా మార్కెట్లో దొరికే  చాక్లెట్స్ ఇవ్వటం కంటే ఈ సారి మీరే స్వయంగా చేసిన హోం మేడ్ చాక్లెట్ ఇస్తే ఇది మరింత  రొమాటింక్ గా ఉండటమే గాక మీ ప్రేయసికి ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకంగా నిలుస్తుంది. అందరూ సులభంగా చేసుకోదగిన, మంచి రుచిగా ఉండే వాలంటైన్స్ డే హోం మేడ్ బాదం చాక్లెట్ తయారీ ఎలాగో తెలుసుకుందాం. 

కావలసినవి

కోకా పౌడర్- 2 చెంచాలు, చక్కెర- 50 గ్రాములు, బట్టర్- 2 చెంచాలు,  పాలపొడి - కప్పు, నీళ్లు- ముప్పావు కప్పు, చాక్లెట్ మౌల్డ్స్ -  10

బాదం గింజలు - గుప్పెడు, వెనీలా ఎసెన్స్: 2చుక్కలు

తయారీ

నీళ్ళు, పంచదార ఒక గిన్నెలో కలిపి మరిగించి పాకం తయారు కాగానే గిన్నె దింపి కొద్దికొద్దిగా పాలపొడి వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో కోకా పౌడర్, బట్టర్ వేసి పిసికి చివరగా 2 చుక్కల వెనీలా ఎసెన్స్ వేసి కలిపుకోవాలి. తర్వాత దీన్ని బ్లెండర్ లో వేసి చిక్కగా మిక్స్ మిక్స్ చేసుకొని అందులో బాదం పలుకులు కలిపి దాన్ని చాక్లెట్ మౌల్డ్స్ లో పోసుకొని ముప్పావుగంట సమయం డీప్ ఫ్రిజ్ లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి వీటిని మీకు నచ్చిన క్రీమ్ తో అలంకరించుకొని  రంగురంగుల రేపర్స్ లో చుట్టి  మీ వాలెంటైన్ డే గిఫ్ట్ గా ఇవ్వండి. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE