రుచి, పోషకాలకు అసలైన చిరునామా.. డ్రై ఫ్రూట్స్. వీటిని నేరుగా తినటం వాళ్లతో బాటు పానీయం రూపంలోనూ తీసుకోవచ్చు. పలు రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి చేసే జ్యూస్ రుచిగా ఉండటమే గాక పోషకాల పరంగా మంచిదే. డ్రై ఫ్రూట్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. 

కావలసినవి  

కిస్ మిస్, బాదం పప్పు, జీడిపప్పు -  ఒక్కోటి అర కప్పు చొప్పున, పాలు- అర లీటరు, చక్కెర - కప్పు , తేనె- 2 చెంచాలు 

తయారీ

ముందు రోజు రాత్రి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను 2 కప్పుల నీటిలో నానబెట్టాలి. ఉదయాన వాటిని మిక్సీ జ్యూస్ జార్లో వేసి బాగా తిప్పి అందులో పాలు, చక్కెర వేసి మరోమారు మిక్సీ పట్టాలి. దీన్ని గ్లాసుల్లో పోసి చెంచా తేనె, అరచెంచా నిమ్మరసం, ఐస్ ముక్కలు వేసి ఎంచక్కా ఆస్వాదించాలి. 



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE