మాంసాహార ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో గోంగూర మటన్ ఒకటి. దీని తయారీకి ఇతర మటన్ వంటకాల మాదిరిగా ఎక్కువ మసాలా దినుసులు వాడక్కరలేదు. కమ్మని రుచి, వాసనతో భోజనప్రియుల నోరూరించే ఈ వంటకం తయారీ ఎలాగో తెలుసుకుందాం.

కావలసినవి

లేత మటన్‌ - అర కేజీ, లేత తాజా గోంగూర - 3 కట్టలు(చిన్నవి), పచ్చిమిర్చి- 6 (నిలువునా చీల్చాలి), పసుపు - చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద- గరిటెడు, గరం మసాలా- చెంచా, ఉల్లి తరుగు- గుప్పెడు, నూనె- గరిటెడు, కారం- 2 చెంచాలు, ధనియాల పొడి- చెంచా, జీలకర్ర పొడి- అరచెంచా, ఉప్పు- రుచికి తగినంత. 

తయారీ

ముందుగా మటన్‌ను 2 సార్లు నీళ్ళుపోసి కడుక్కొని కుక్కర్లో వేసి దానికి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, కొద్దిగా ఉప్పు వేసి అరగ్లాసు నీళ్లు పోసి కలిపి 4 విజిల్స్‌ వచ్చే దాకా ఉడికించి పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె తీసుకొని వేడెక్కాక ఉల్లితరుగు, గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తర్వాత దీనిలో అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, పచ్చిమిర్చి, గోంగూర వేసి బాగా కలిపి సన్నని సెగమీద బాగా ఉడికేలా చూడాలి. ఈ గోంగూర మిశ్రమంలో కుక్కర్లో ఉడికించిన మటన్‌, తగినంత ఉప్పు వేసి కలిపి మరో 15 నిమిషాలు సన్నని సెగమీద ఉడికిస్తే నోరూరించే గోంగూర మటన్ రెడీ అయినట్లే. 



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE